Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

అడివి శేష్ చిత్రం మేజర్ నుండి సెకండ్ సింగల్ విడుదల

Advertiesment
Adivi Shesh, Sai Manjrekar
, బుధవారం, 18 మే 2022 (18:12 IST)
Adivi Shesh, Sai Manjrekar
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'మేజర్'.  26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది.
 
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'మేజర్'లో..  మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు.
 
మ్యూజికల్ ప్రమోహన్స్ లో భాగంగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం నుండి సెకెండ్ సింగల్ ''ఓహ్ ఇషా' వీడియో సాంగ్ ఈ రోజు విడుదల చేశారు.
 
ఒక గెట్ టుగెదర్ లో ఆర్మీ అధికారుల తమ లైఫ్ పార్ట్నర్స్ తో  డ్యాన్స్ చేస్తున్నపుడు మేజర్ సందీప్ గా శేష్ తన తొలిప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో పాట మొదలైయింది. కాలేజీ డేస్ ప్రేమలో వుండే అందం, అమాయకత్వంఈ పాటలో లవ్లీగా ప్రజంట్ చేశారు. 90'లో యంగ్ సందీప్ ఫస్ట్ లవ్ ని ఈ పాటలో అందంగా చూపించారు. సందీప్ కాలేజీ డేస్ లోని జ్ఞాపకాలని, లవ్లీ మూమెంట్స్ ని ప్లజంట్ గా చిత్రీకరించారు. ఈ పాటలో శేష్, సాయి మంజ్రేకర్ జోడి చాలా క్యూట్ గా అలరించింది. శేష్ అచ్చూ కాలేజీ స్టూడెంట్ లానే మేకోవర్ అవ్వడం నేచురల్ గా వుంది. ఈ పాటలో సాయి మంజ్రేకర్ తన ఫోన్ నెంబర్ ని ఒక్కొక్కటి గా ఇవ్వడం, ఇద్దరూ కెరీర్ ని డిసైడ్ చేసుకోవడం, ఫ్యామిలీ.. ఇలా అందంగా లవ్లీ మాంటేజస్ లో చూపించడం ఆకట్టుకుంది.
♪♪ హాయి హాయి హాయి
ఈ మాయ ఏమిటోయి
గుండె ఆగి ఆగి ఎగురుతున్నది
చిక్కులన్నీ కూర్చి ఓ లెక్కలేవో నేర్చి
అంకెలాటలేవో ఆడుతున్నది ♪♪
ఈ లవ్లీ మోలోడీకి రాజీవ్ భరద్వాజ్ అందించిన సాహిత్యం కూడా అంతే హాయిగా అనిపించింది. అర్మాన్ మాలిక్, చిన్మయి శ్రీపాద పాటని మరింత శ్రావ్యంగా ఆలపించారు. లవ్లీ మెలోడీగా వచ్చిన ఈ పాట ఇన్సెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
   
శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది.
 
26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు ఘనమైన నివాళిగా రూపొందిన ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.
 
ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో మేజర్ చిత్రం ముందువరుసలో వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స‌త్య‌దేవ్ చిత్రం గాడ్సే రిలీజ్ డేట్ ఖ‌రారు