Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయిన బుజ్జిగాడు నటి

Advertiesment
డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయిన బుజ్జిగాడు నటి
, మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (21:27 IST)
శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. నటి సంజనా గల్రానీని అరెస్టు చేశారు సీసీబీ పోలీసులు. డ్రగ్స్ కేసులో నటి సంజనా ప్రమేయం ఉందంటూ విచారణలో బయటపడటంతో ఆమెను అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం నుంచే నటి సంజనా ఇంట్లో సిసిబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ వ్యవహారంపై ఆమెను అరెస్టు చేయడమే కాకుండా 5 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఒక్కసారిగా కన్నడ నటుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 
 
నిన్న నటి రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు ఐదు రోజుల రిమాండ్ కూడా విధించారు. ముఖ్యంగా ఫిల్మ్ మేకర్ ఇంద్రజిత్ ఇచ్చిన లిస్టులో ప్రముఖులపై సీసీబీ పోలీసులు విచారణ జరిపి వారిలో ఒక్కొక్కరిగా అరెస్టులు చేస్తున్నారు. 
 
లాక్‌డౌన్ టైమ్‌లో ఫుడ్ డెలివరీ బాయ్స్ ద్వారా సప్లై చేసినట్లు గుర్తించారు. డెలివరీ బాయ్స్‌ను పోలీసులు చెక్ చేయరని వారి ద్వారా సరఫరా చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారం కాస్తా కన్నడనాటలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇంకా ఎంతమంది ప్రముఖుల పేర్లు బయటపడతాయోనన్న ఆసక్తి కనబడుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైను వీడిపోతానంటున్న కంగనా రనౌత్.... ఎందుకని?