Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టైటిల్ గెలిచావ్‌గా.. ఇకనైనా కంట్రోల్‌లో ఉండమను..

బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ గెలుపులో ముఖ్యపాత్ర పోషించినది కౌశల్ ఆర్మీ అనేది జగమెరిగిన సత్యం. అభిమానులంతా కలిసి ఒక ఆర్మీగా ఏర్పడి, ప్రచారాలు చేయడం, 2కె రన్‌లు నిర్వహించడం వంటివి చేసారు.

Advertiesment
టైటిల్ గెలిచావ్‌గా.. ఇకనైనా కంట్రోల్‌లో ఉండమను..
, గురువారం, 4 అక్టోబరు 2018 (14:18 IST)
బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ గెలుపులో ముఖ్యపాత్ర పోషించినది కౌశల్ ఆర్మీ అనేది జగమెరిగిన సత్యం. అభిమానులంతా కలిసి ఒక ఆర్మీగా ఏర్పడి, ప్రచారాలు చేయడం, 2కె రన్‌లు నిర్వహించడం వంటివి చేసారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మిగతా వ్యక్తులను కించపరిచేలా ట్రోలింగ్ చేయడం, ఆడవారిపై అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం, వారి వ్యక్తిగత విషయాలను బయటికి లాగి నానా రభస చేయడం మాత్రం సరికాదంటూ బిగ్ బాస్ టు సీజన్ మొదటి ఫైనలిస్ట్ అసంతృప్తి వ్యక్తపరిచారు. ఇలాంటి పనుల వలన అందరూ చాలా బాధపడుతున్నారని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
 
పర్సనల్ లైఫ్ గురించి ట్రోల్ చేస్తే ఎవరికైనా బాధగా ఉంటుంది. కనీసం మగవాళ్లైనా ఒక పరిధి వరకు లైట్ తీసుకోగలరు, కానీ ఆడవాళ్లు అలా తీసుకోలేరు. ఒక వ్యక్తి మీద అభిమానం చూపించుకోవడానికి మిగతా వ్యక్తులను కావాలనే వారి పర్సనల్ లైఫ్‌లోకి వెళ్లి పూర్తిగా తెలియకుండానే డీఫేమ్ చేస్తున్నారు. ఇది మంచిది కాదని సామ్రాట్ అభిప్రాయపడ్డారు. 
 
హౌస్‌లో అందరి మధ్య గేమ్ చాలా స్పోర్టివ్‌గా జరిగింది. బయట జరుగుతున్న విషయాలు బయటకు వచ్చాకే తెలిసాయి. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వారి ప్రొఫెషన్‌కు ఇబ్బంది కలిగేలా ట్రోల్ చేయడం బాధాకరం. నాపైన కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. చివరికి నాని అన్న సినిమాను బహిష్కరించే స్థాయిలో ఇదంతా జరిగిందంటే నమ్మశక్యంగా లేదు.
 
కౌశల్ 20 ఏళ్లుగా పరిశ్రమలో ఎదగడానికి కష్టపడుతున్నారు, అలాగే నేను కూడా 11 ఏళ్లుగా కష్టపడుతున్నాను. నీ అభిమానులను చూసి ఆశ్చర్యపోయాను. చాలా ఆనందంగా ఉంది. కానీ అభిమానం పేరుతో నీతో పాటు ఇన్నిరోజులు ఉన్న నీ హౌస్‌మేట్స్‌ను కించపరుస్తున్నారు. గేమ్ ముగిసింది. టైటిల్ నీకు స్వంతమైనందుకు ఆనందంగా ఉంది. ఇక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ ట్రోల్స్ చేస్తున్నవారిని ఆపించు. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ అని కౌశల్‌ను సామ్రాట్ రిక్వెస్ట్ చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత-చై ఫస్ట్ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్... చిక్కంతా పొట్టి దుస్తులతోనే...