Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"తుఫాను వచ్చే ముందు ఉండే నిశ్శబ్దంలా" అభిమాని ప్రశ్నకి సమంత రిప్లై

అక్కినేని ఇంటికి కోడలైన వేళా విశేషమో ఏమోగానీ.. హీరోయిన్ సమంత దశ తిరిగిపోయింది. 2018లో ఈమె నటించిన అన్ని చిత్రాలూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ యేడాది తొలి ఆరు నెలల పాటు ఆమె ఎంతోగానో ఎంజాయ్ చేసింది

Advertiesment
, ఆదివారం, 10 జూన్ 2018 (16:49 IST)
అక్కినేని ఇంటికి కోడలైన వేళా విశేషమో ఏమోగానీ.. హీరోయిన్ సమంత దశ తిరిగిపోయింది. 2018లో ఈమె నటించిన అన్ని చిత్రాలూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ యేడాది తొలి ఆరు నెలల పాటు ఆమె ఎంతోగానో ఎంజాయ్ చేసింది. అలాగే ఆమె ఫ్యాన్స్ కూడా ఎంతో ఖుషీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ యేడాది రెండో ద్వితీయార్థంపై ఫ్యాన్స్ బెంగపెట్టుకున్నారు.
 
ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో స‌మంత చేసిన అన్నీ సినిమాలు మంచి విజ‌యం సాధిండంతో ద్వితీయార్ధం ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో అభిమానులు ఉన్నారు. ఈ అమ్మ‌డు మాత్రం సెకండాఫ్‌లో కూడా త‌న‌కి మంచి విజ‌యాలు ద‌క్కుతాయ‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ క్ర‌మంలో త‌న ట్విట్ట‌ర్‌లో 'తుఫాను వచ్చే ముందు ఉండే నిశ్శబ్దంలా... ఫస్ట్‌ హాఫ్‌ సక్సెస్‌ అయినట్లు సెకండాఫ్‌ కూడా ఉండబోతోంది... సూప‌ర్ డీలక్స్‌, సీమ రాజా, యూ టర్న్ చిత్రాల‌కి డబ్బింగ్‌ మొదలైంది' అంటూ త‌ను డ‌బ్బింగ్ చెబుతున్న ఫోటో ఒక‌టి షేర్ చేస్తూ ఈ కామెంట్ పెట్టింది. 
 
కాగా, 2018లో సమంత నటించిన విడుదలైన తొలి చిత్రం 'రంగస్థలం'. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో డీ గ్లామర్ రోల్‌లో నటించి రామలక్ష్మిగా ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచింది. ఇకపోతే రెండో చిత్రం 'మహానటి'. ఇందులో మధురవాణిగాను, మూడో చిత్రం 'అభిమన్యుడు'లో రతిదేవిగా అద్భుత పాత్రలు పోషించి అలరించింది. 
 
ఇలాగే, ప్రస్తుతం 'సూపర్ డీలక్స్', 'సీమ రాజా' అనే తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. ఇక తన భర్త చైతూ ప్రధాన పాత్రలో శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్న సినిమా కూడా చేస్తుంది సామ్. ఇదీకాక 'యూటర్న్' అనే రీమేక్ చిత్రం కూడా చేస్తుంది. సో ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూనే అటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌లో ఇన్ని విజ‌యాలు సాధించ‌డం స‌మంత‌కే చెల్లిందని చెప్ప‌వ‌చ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తరుణ్ భాస్కర్ "ఈ నగరానికి ఏమైంది" ట్రైలర్...