Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంసారంలో సరిగమలుంటాయ్.. సమంత సర్దుకుపో.. శ్రీరెడ్డి

Advertiesment
సంసారంలో సరిగమలుంటాయ్.. సమంత సర్దుకుపో.. శ్రీరెడ్డి
, శుక్రవారం, 1 అక్టోబరు 2021 (12:48 IST)
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోవార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ విషయంపై చై-సామ్ జంట ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 
 
తాజాగా టాలీవుడ్ నటి శ్రీరెడ్డి సామ్‌-చైతూ వ్యవహారంపై తన స్పందనను తెలియజేస్తూ ఓ వీడియో మెసేజ్‌ను ట్విటర్ లో షేర్ చేసింది. మీరిద్దరూ కలిసుండాలని మేము కోరుకుంటున్నాం. మీ ఇద్దరినీ మేమంతా ఆశీర్వదిస్తున్నాం. మీరు ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించే భార్యాభర్తల్లా ఉండాలనుకుంటున్నాం.
 
మిమ్మల్ని చూసి చాలా మంది స్పూర్తి పొందుతారు. భార్యాభర్తలన్న తర్వాత సంసారంలో సరిగమలుంటూనే ఉంటాయి. కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈగో, ఆటిట్యూడ్స్, ఇది అది తేడా లేకుండా చాలా అపార్థాలుంటాయి. 
 
ఒక అమ్మాయికి ఎక్కువ ఓపిక ఉండాలని మన భారతదేశం మనకు నేర్పించింది. సమంత కొన్ని విషయాలు మార్చుకుంటే తన సంసారం కానీ, తను కానీ బాగుంటుందనేది నా ఉద్దేశం. అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 31న RRR Release డేట్ ఖరారు?