Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవకాశాల కోసం వెంపర్లాడలేదు.. సమంత

Advertiesment
అవకాశాల కోసం వెంపర్లాడలేదు.. సమంత
, ఆదివారం, 28 అక్టోబరు 2018 (14:41 IST)
తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకు తనకు నటించే ఛాన్స్ ఇవ్వాలని ఏ ఒక్కరినీ అడగలేదని సినీ నటి సమంత అంటోంది. పైగా, ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోగలను అంటోంది ఆమె. ఒకరి చిత్రాలు మరొకరు చేయడం సహజమే అయితే మరో నాయిక చేయబోతున్న పాత్రల కోసం తానెప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టంచేసింది. 
 
ఇటీవలే 'యూటర్న్‌' వంటి విజయాన్ని అందుకున్న శ్యామ్‌.. ప్రస్తుతం తమిళంలో "సూపర్‌ డీలక్స్‌" చిత్రంతో పాటు తెలుగులో తన భర్త నాగచైతన్యతో ఓ చిత్రంలో నటిస్తోంది. ఇదే అంశంపై సమంత మాట్లాడుతూ, ఇన్నేళ్ల నా కెరీర్‌లో సినిమాల కోసం దగ్గరి దారిని వెతకలేదు. తన కథలో ఏ నాయికను తీసుకోవాలి అనేది ఓ దర్శకుడి సృజనాత్మక ప్రక్రియలోభాగమని చెప్పుకొచ్చింది. 
 
ముఖ్యంగా, ఈ విషయంలో తాను ఎన్నడూ జోక్యం చేసుకోను. పెళ్లైన నాయికల విషయంలో గతంలోని పరిస్థితులు ఇప్పుడు లేవు. అంతా మారిపోతున్నాయి. సమంతకు పెళ్లి అయింది కాబట్టి సినిమా చూడను అని ఎవరూ అనట్లేదు కదా. పాత్ర బాగుండి, కథ నచ్చితే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. తొలి చిత్రం నుంచి నా సినిమాల పట్ల ఆసక్తిగానే ఉన్నట్టు తెలిపింది.
 
అంతేకాకుండా, సుదీర్ఘ ప్రయాణ కోరుకునే వాళ్లంతా కొన్ని చిత్రాలు తప్పని పరిస్థితుల్లో చేయాల్సి ఉంటుంది. నా ప్రయాణంలో కొన్ని సినిమాలు అలా చేయాల్సివచ్చింది. వాటిలో నేను చేసినవి ఎప్పుడూ చూసే గ్లామర్‌ కొలతల పాత్రలు. అదృష్టవశాత్తూ ఆ చిత్రాలన్నీ అపజయం పాలై నా కళ్లు తెరిపించాయి. అప్పటి నుంచి మనసుకు నచ్చిన క్యారెక్టర్‌లే చేయాలని నిర్ణయించుకున్నాను. అలాంటి అవకాశాలు లేకుంటే ఇంట్లో ఖాళీగా కూర్చున్నా ఫర్వాలేదనుకున్నా అని సమంత స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబర్ 3న శంకర్ '2.0' ట్రైలర్ రిలీజ్