Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షూటింగ్ మధ్యలో బోరున విలపించిన సమంత... ఎక్కడ.. ఎందుకు?

Advertiesment
షూటింగ్ మధ్యలో బోరున విలపించిన సమంత... ఎక్కడ.. ఎందుకు?
, బుధవారం, 6 అక్టోబరు 2021 (20:14 IST)
ఇటీవలే తన భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకోబోతున్నట్టు హీరోయిన్ సమంత ప్రకటించారు. ఈ అంశం చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనమైంది. అయితే, ఈ ప్రకటన చేసిన తర్వాత సమంత ఎప్పటిలాగానే షూటింగుల్లో పాల్గొంటుంది. కానీ, ఆమె భర్త నాగ చైతన్య మాత్రం ఓ హోటల్‌ గదికి పరిమితమైనట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత సమంత తొలిసారి షూటింగులో పాల్గొంది. హైదరాబాదులోని 'మకరం ఝా' జూనియర్ కళాశాలలో ఒక యాడ్ షూటింగులో ఆమె పాల్గొంది. షూటింగులో బ్రేక్ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి బోరున విలపించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ యాడ్‌‌ను ముంబై బేస్డ్ ఫిల్మ్ మేకర్ విశేష్ వర్మ తీస్తున్నారు. అయితే ఈ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సమంత విడాకుల ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో యాడ్ షూటింగుకు ఆమె రాగలదా? అనే సందేహంలో యూనిట్ పడిపోయింది. కానీ, ఎంతో బాధలో ఉన్నప్పటికీ సమంత షూటింగులో పాల్గొని, తన ప్రొఫెషనలిజంను చాటుకోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహా ఉల్లాల్ రీ ఎంట్రీ... బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే లుక్