Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా వీధుల్లో తల్లితో కలిసి హీరోయిన్ సమంత చక్కర్లు..

Advertiesment
samantha
, సోమవారం, 21 ఆగస్టు 2023 (11:54 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత అమెరికా వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. తన తల్లితో కలిసి అగ్రరాజ్యం వెళ్లిన సమంత.. అక్కడ సేదతీరుతున్నారు. ఈ పర్యటనలో ఆమె తన స్నేహితులతో కలిసి అమెరికా వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అదేసమయంలో ఆమె తన ఫిట్నెస్‌పై మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చూపించడం లేదు. అక్కడ కూడా జిమ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.
webdunia
 
అలాగే, ఈ పర్యటనలో సమంత హుషారుగా కనిపించింది. స్నేహితులతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, అందమైన లొకేషన్లను చుట్టేస్తున్నారు. తనకు ఇష్టమైన రెస్టారెంట్లలో రుచికరమైన ఆహారపదార్థాలు టేస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా.. అమెరికాలోని ఓ జిమ్‌లో శరీర ఫిట్నెస్ కోసం వ్యాయామాలు చేశారు. సమంత జిమ్‌లో ఉన్న ఫోటో ఒకటి లీక్ కాగా అది ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలావుంటే, హీరో విజయ్ దేవరకొండతో కలిసి సమంత నటించిన కొత్త చిత్రం "ఖుషి" వచ్చే నెల ఒకటో తేదీన విడుదలకానుంది. 
 
లేహ్ జిల్లాలో ప్రమాదం.. తెలంగాణ జవాన్ మృతి  
 
జమ్మాకాశ్మీర్ రాష్ట్రంలోని లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో శనివారం సైనికులు ప్రయాణిస్తున్న వాహనం ఒకటి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల్లో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిర్మన్ దేవులపల్లికి చెందిన జవాను చంద్రశేఖర్ (30) కూడా ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. 
 
ఈ గ్రామానికి చెందిన మల్లయ్య, శివమ్మ దంపతుల ముగ్గురు సంతానంలో చిన్నవాడైన చంద్రశేఖర్‌ కొందుర్గులోని బీసీ సంక్షేమ వసతిగృహంలో పదోతరగతి వరకు చదివారు. తదనంతరం ఆయన 2011లో సైన్యంలో చేరారు. విధి నిర్వహణలో భాగంగా శనివారం లేహ్‌ జిల్లాలో తోటి సైనికులతో కలిసి ప్రయాణిస్తుండగా వాహనం లోయలో పడింది. 
 
ఈ దుర్ఘటనలో చంద్రశేఖర్‌ ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడు నెలల క్రితం గ్రామానికి వచ్చిన ఆయన కుమారుడిని బడిలో చేర్పించేందుకు మళ్లీ వస్తానని చెప్పి వెళ్లారంటూ ఆయన భార్య లాస్య కన్నీటి పర్యంతమయ్యారు. జవాన్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పార్థివదేహం సోమవారం గ్రామానికి చేరుకోవచ్చని మాజీ సర్పంచి రామకృష్ణ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ మహిళ అభ్యంతరకరంగా తాకింది.. దుల్కర్ సల్మాన్