Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జపాన్‌‌లో సందడి చేస్తోన్న సాయిపల్లవి -జునైద్ ఖాన్

Advertiesment
Sai Pallavi

సెల్వి

, సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (19:37 IST)
Sai Pallavi
నటి సాయి పల్లవి - నటుడు జునైద్ ఖాన్ జంట జపాన్‌‌లో సందడి చేస్తోంది. స్నో ఫెస్టివల్‌లో జపాన్‌లోని సపోరోలో వీరిద్దరూ ఎంజాయ్ చేయడం చూడవచ్చు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమారుడైన జునైద్ ఖాన్.. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా జపాన్‌లో సాయిపల్లవితో కలిసి కనిపించాడు. వారి రాబోయే ఇంకా పేరు పెట్టని చిత్రం సెట్స్ నుండి కనిపించారు. వీరిద్దరూ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నారు.
 
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఊహించని హిమపాతం కారణంగా మొదట్లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. జునైద్-సాయి పల్లవి డిసెంబరు 1న తమ రాబోయే చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనుంది. 
 
జపాన్‌లోని సపోరో నగరంలో ఇది సెట్ చేయబడింది. జునైద్ ఖాన్ సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించిన రాబోయే చిత్రం 'మహారాజ్'తో తన సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కళాకారుడిగా బాధ్యతతో తీసిన సినిమా డ్రిల్‌ ; హరనాధ్‌ పొలిచెర్ల