Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళాకారుడిగా బాధ్యతతో తీసిన సినిమా డ్రిల్‌ ; హరనాధ్‌ పొలిచెర్ల

Haranadh Policherla is the hero, director and producer

డీవీ

, సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (17:43 IST)
Haranadh Policherla is the hero, director and producer
డ్రీమ్‌ టీమ్‌ బ్యానర్‌పై, దర్శక నిర్మాత, కధానాయకుడు హరనాధ్‌ పొలిచెర్ల చేసిన క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ డ్రిల్‌. కారుణ్య చౌదరి హీరోయిన్‌ గా , భవ్య, నిషిగంధ ప్రధాన పాత్రల్లో, తనికెళ్ళ భరణి, రఘుబాబు, జెమినీ సురేష్‌, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ, జబ్బర్దస్థ్‌ ఫణి ప్రధాన తారాగణంగా చేసిన డ్రిల్‌ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 16న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా  హీరో, నిర్మాత, దర్శకుడు హరనాధ్‌ పొలిచెర్ల పాత్రికేయులతో ముచ్చటించారు.  
 
నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే 8వ తరగతి నుంచే నాటకాలు వేయడం ప్రారంభించాను. ఆ తర్వాత పలు పరిషత్‌ ప్రదర్శనలు కూడా ఇచ్చాను. ఆమెరికాలో డాక్టర్‌గా బిజీబిజీగా గడుపుతున్నప్పుడు ఒకరోజు అసలు మన లక్ష్యం ఏమిటి? మనం వెళుతున్న రూట్‌ ఏమిటి అని ఆలోచించాను. మళ్లీ నటన వైపు మళ్లాను. కన్నడంలో కూడా కొన్ని సినిమాల్లో చేశాను. తెలుగులో కెప్టెన్‌ రాణా ప్రతాప్‌, టిక్‌ టిక్‌, చంద్రహాస్‌, తదితర ఎనిమిది సినిమాలు తీశాను. ‘హోప్‌’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. అమెరికాలో డాక్టర్‌ వృత్తిలో ఎంతో బిజీగా ఉన్నా ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్‌ తెలుసుకొంటాను. ఈ సినిమా విషయానికి వస్తే ఇదొక క్రైవమ్‌బేస్డ్‌ మూవీ. ఇందులో లవ్‌ జిహాదీ అనేది కొంత భాగం మాత్రమే. నేను పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చేశాను. నా వృత్తిలో భాగంగా చేధించే కేసుల్లో ఈ లవ్‌ జిహాదీ అనేది ఒక కేసు. నా ప్రతి సినిమాలోనూ కమర్షియల్‌ కంటెంట్‌తో పాటు మెసేజ్‌ ఉండేలా చూసుకుంటాను. అయితే గొప్ప గొప్ప మెసేజ్‌లు చెప్పే స్థాయి కాదు నాది. 
 
కానీ సమాజం పట్ల కళాకారుడిగా నాకు బాధ్యత ఉంటుంది. దాన్ని మాత్రం ప్రతి క్షణం గుర్తు  పెట్టుకుంటాను. ఈసినిమా కోసం చాలా కష్టపడ్డాం. సినిమా ఫస్ట్‌ కాపీ చూసుకున్న తర్వాత ఆ కష్టాలు అన్నీ మర్చిపోయాను. ‘డ్రిల్‌’ అనేది ఒక ఆయుధం. హత్యలు చేసే మనస్తత్వం ఉన్న వారు ఒక్కోసారి స్పెసిఫిక్‌గా కొన్ని ఆయుధాలను వాడతారు. అలాగే ఈ సినిమాలో హంతకుడు కూడా డ్రిల్లింగ్‌ మిషన్‌ను వాడి అందరినీ చంపుతుంటాడు. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచటం కోసం ‘డ్రిల్‌’ అని పెట్టాము.
 
మనం వాక్‌ స్వాతంత్య్రాన్ని తొక్కి పెట్టుకుని ఉండటం వల్ల ఉపయోగం లేదు కదా. మనం నలుగురు మధ్యనో.. నాలుగు గోడల మధ్యనో ఏదైనా డిస్కస్‌ చేసుకుంటున్నామో, దాన్ని సమాజానికి కూడా తెలిసేలా చేయాలి. అప్పుడు దాని మంచి, చెడులు ప్రజలకు తెలుస్తాయి. ఇందుకు సినిమా అనేది ఒక ప్రధాన వేదిక.
 
‘డ్రిల్‌’ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. ఇలాంటి క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలకు మ్యూజిక్‌, కెమెరా చాలా కీలకం. మా సంగీత దర్శకుడు డిఎస్‌ఎస్‌కె అటు సాంగ్స్‌ పరంగా, ఇటు సిట్యుయేషన్‌ పరంగా, బ్యాక్‌గ్రౌండ్‌ పరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సంగీతం సినిమాలోని కొన్ని సీన్లను బాగా ఎలివేట్‌ చేశాయి. అలాగే కెమెరామెన్‌ వంశీకృష్ణ ప్రతి ఫ్రేమ్‌ను ఆకట్టుకునేలా చిత్రీకరించారు. ఆయన మా సినిమాకు ఒక పెద్ద ఎస్సెట్‌ అని చెప్పాలి. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఈనెల 16న వరల్డ్‌వైడ్‌గా భారీగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రేక్షకులు మమ్మల్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రి కొడుకుల బంధాన్ని చెప్పే లవ్ యువర్ ఫాదర్ ప్రారంభం