సచిన్ స్పూర్తిమంతుడన్న మెగాస్టార్
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (12:18 IST)
మెగాస్టార్ చిరంజీవి క్రికెట్ ధీరుడు సచిన్ టెండూల్కర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేస్తూ, కోట్లమంది గుండెల్లో కొలువైన నీవు, ఎంతోమందికి స్పూర్తినిచ్చావని ప్రశంసించారు. కోట్లమంది ఎమోషన్స్‌ను నీలో చూసుకుంటూ అలరిస్తున్న అందరికీ ఈ పుట్టినరోజు గొప్పరోజు అవుతుందని పేర్కొన్నారు. ఎంత వున్నా ఒదిగి వుండే నీ గుణం, సౌమ్యం ఎంతో ఆకట్టుకున్నాయంటూ కితాబిచ్చారు.
అంతే కాకుండా మాస్టర్ బేట్స్‌మెన్ సచిన్ ఆడుతున్న అంతర్జాతీయ క్రికెట్ మేచ్‌ను తనవీతీరా చూసే భాగ్యం కలిగిన ఫొటోలను ఆయన షేర్ చేసుకున్నారు. ఇదేవిధంగా పవన్‌కళ్యాణ్ కూడా సచిన్‌తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ ఫొటోను ట్వీట్ చేశాడు. దీనికి ప్రతిగా మీలాంటి స్పూర్తిమంతులతో తాను భాగమైనందుకు ఆనందంగా వుందని సచిన్ ట్వీట్ చేశారు.
తర్వాతి కథనం