బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ట్రైలర్, టీజర్, పోస్టర్లు అప్పుడప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్ర సీమల్లోను భారీ అంచనాలున్న నేపథ్యంలో.. సినిమా ప్రమోషన్‌లో బాగంగా చిత్ర యూనిట్ మరో కొత్త పోస్టర్ విడుదల చేసింది.
ఈ కొత్త పోస్టర్‌లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ సూపర్ రొమాంటిక్ లుక్‌లో అదరగొట్టారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఒకరిని ఒకరు ప్రేమగా కౌగిలించుకుని అదరగొట్టారు. ఈ పోస్టర్‌ను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.
ఆయన తన పోస్ట్‌లో ‘హాయ్ డార్లింగ్స్. ''సాహో" రెండో పాట త్వరలో విడుదల కాబోతోంది'' అని రాస్తూ.. ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సూపర్ రోమాంటిక్‌గా ఉండడంతో ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు గ్రాఫిక్స్ పనుల కారణంగా ఈ సినిమాను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు.