Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్ను కోల్పోయిన 30 రోజులు.. కానీ నిన్ను జీవితకాలం ప్రేమిస్తునే వుంటా?

Advertiesment
నిన్ను కోల్పోయిన 30 రోజులు.. కానీ నిన్ను జీవితకాలం ప్రేమిస్తునే వుంటా?
, మంగళవారం, 14 జులై 2020 (12:16 IST)
sushanth singh
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి సరిగ్గా నెల అయ్యింది. అంటే సరిగ్గా నెల రోజుల క్రితం జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఆయన మరణ వార్త ఎందరికో తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రతి రోజు అభిమానులు, సన్నిహితులు ఆయనకి సంబంధించిన జ్ఞాపకాలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.

తాజాగా దిల్ బెచారా దర్శకుడు ముకేష్ చబ్రా సెట్‌లో సుశాంత్‌తో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ.. ఎమోషనల్ కామెంట్ పెట్టాడు. సుశాంత్ నుంచి ఫోన్ కూడా రాదు.. నెలరోజులైంది అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. 
 
మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేమికురాలిగా చెప్పబడుతున్న రియ చక్రవర్తి భావోద్వేగ ట్వీట్ చేసింది. "నా భావోద్వేగాలను ఎదుర్కోవటానికి ఇంకా కష్టపడుతున్నాను .. నా హృదయంలో కోలుకోలేని తిమ్మిరితో బాధపడుతున్నానని పోస్టు చేసింది. తన నష్టాన్ని తాను ఎప్పటికీ పొందలేనని అంగీకరించింది. మీరు నన్ను ప్రేమను, దాని శక్తిని విశ్వసించేలా చేశారు. 
 
ఒక సాధారణ గణిత సమీకరణం జీవిత అర్ధాన్ని ఎలా అర్థం చేసుకోగలదో మీరు నాకు నేర్పించారు. నేను ప్రతిరోజూ మీ నుండి నేర్చుకున్నాను. నేను నా షూటింగ్ స్టార్ మీ కోసం వేచి ఉంటాను మరియు మిమ్మల్ని తిరిగి నా దగ్గరకు తీసుకురావాలని కోరుకుంటాను.
 
మీరు ఒక అందమైన వ్యక్తి కావచ్చు, ప్రపంచం చూసిన గొప్ప అద్భుతం. నా మాటలు మనకున్న ప్రేమను వ్యక్తపరచలేకపోతున్నాయి. ప్రతి విషయంలోనూ పారదర్శకతను పాటిస్తారు. ప్రశాంతంగా ఉండండి సుశి. నిన్ను కోల్పోయిన 30 రోజులు.. కానీ నిన్ను ప్రేమిస్తున్న జీవితకాలం.... అంటూ రియా చక్రవర్తి భావోద్వేగ నోట్ రాసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ సరసన దీపికా నటించాల్సిందే.. పట్టుబడుతున్న నాగ్ అశ్విన్?