మాస్ మహారాజా రవితేజ తన మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది.
ఉగాది రోజున (ఏప్రిల్ 2న) మాదాపూర్‌లోని నోవాటెల్‌లో (హెచ్‌ఐసిసిలో) టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఉగాది నాడు మధ్యాహ్నం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్‌ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా గురువారంనాడు తెలియజేసింది. పాన్ ఇండియా చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్`తో బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాత అభిషేక్ అగర్వాల్‌కి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్.
టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ సినిమా. 1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన, సాహసోపేతమైన స్టువర్ట్‌పురం నాగేశ్వరరావు కథ. అక్కడ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చిత్రం. పవర్ ఫుల్ పాత్రలో నటించేందుకు రవితేజ పూర్తిగా తనను తాను మలుచుకోనున్నాడు. అందుకు తగిన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి.. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలో రవితేజ కనబడనున్నాడు.
దర్శకుడు వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది.
టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ రవితేజకు పర్ఫెక్ట్ సినిమా. మాస్ ఆధారిత పాత్రలు పోషించడంలో ఆయన ప్రత్యేకతను సంతరించుకున్నాడు.
ఈ సినిమా టైటిల్ పోస్టర్ భారీ రెస్పాన్స్ సంపాదించి ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచింది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో నిండిన ఈ సినిమాపై ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది. 1970 నాటి కథ కావడంతో ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.
ఇది విజువల్‌గా చాలా అద్భుతంగా ఉండేలా ఆర్. మది ISC కెమెరా బాధ్యతలు చేపట్టారు. GV ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా వ్యవహరించనున్నారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
తారాగణం: రవితేజ
రచయిత, దర్శకుడు: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సమర్పకుడు: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీత దర్శకుడు: జివి ప్రకాష్ కుమార్
DOP: ఆర్ మదీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా