Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడల్ట్ స్టోరీతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రష్మీ...

బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. ఈమె వెండితెరపై మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "అంతకుమించి". ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది.

Advertiesment
అడల్ట్ స్టోరీతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రష్మీ...
, గురువారం, 23 ఆగస్టు 2018 (10:50 IST)
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. ఈమె వెండితెరపై మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "అంతకుమించి". ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌లను చూస్తుంటే ఇది ఖచ్చితంగా అడల్డ్ మూవీగా కనిపిస్తోంది. గతంలో రష్మీ 'గుంటూరు టాకీస్' అనే చిత్రంలో తన అందాలను ఆరబోసిన విషయం తెల్సిందే. ఇపుడు 'అంతకుమించి' ఆరబోసినట్టుగా తెలుస్తోంది.
 
ఈ చిత్రంతో మరో మూడు చిత్రాలు శుక్రవారం విడుదల కానున్నాయి. నారా రోహిత్‌, జ‌గ‌ప‌తి బాబు ప్ర‌ధాన పాత్ర‌లో "ఆట‌గాళ్ళు" తెర‌కెక్క‌గా, ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో "నీవెవ‌రో" చిత్రం రూపొందింది. ఈ రెండు సినిమాల‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్ర‌భుదేవా న‌టించిన "ల‌క్ష్మీ" చిత్రంపై కూడా అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. మ‌రి రేపటి సినిమాల‌లో ఏ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధిస్తుందో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ను వీడనున్న శ్రీరెడ్డి... తమిళ తంబీలు 'క్యూ' కడుతున్నారట...