మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటిస్తున్న సినిమా `ఆచార్య`. ఇటీవలే తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. చిరంజీవి, రామ్‌చరణ్ నగ్జలైట్ గా కన్పించనున్నారు. కాగా, బుధవారంనాడు తాజా స్టిల్‌ను రామ్‌చరణ్ తన సోషల్‌మీడియాలో అభిమానులకు పోస్ట్ చేశాడు. యుద్ద వాతావరణాన్ని తలపించేరీతిలో ఓ సన్నివేశాన్ని చిత్రించనున్నట్లు తెలుస్తోంది. చుట్టూ కొండలు మైనింగ్ ప్రాంతాన్ని తలపించే క్వారీ ప్రాంతంలో తదుపరి సీన్‌ను పరిశీలిస్తున్న చిరంజీవి, ఆయనకు గొడుగు పట్టిన రామ్‌చరణ్ కనిపించారు.
దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కూ ప్రాధాన్యత వుంది. ఇందులో ఫైటర్లు పాల్గొన్న సన్నివేశంలో వున్నట్లు తెలుస్తోంది. తన ప్రతి సినిమాలోనూ సోషల్ మెసేజ్ ఇచ్చే కొరటాల ఈ సినిమాలోనూ ఆచార్యదేవో భవ అన్నంతలా చక్కటి సందేశాన్ని ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. త్వరలో ఈ చిత్రం షెడ్యూల్‌ను పూర్తి చేసుకోనున్నారు.
కొనిదెలా ప్రొడక్షన్ కంపెనీతో పాటు మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి ఆనుకున్న వున్న బయట ఓ గ్రామంలో జరుగుతోంది.