రామ్ పోతినేని, శ్రీలీల నటించిన స్కంద సిని;మా ప్రీ రిలీజ్ హైదరాబాద్ శిల్ప కళావేదికలో శనివారం రాత్రి జరిగింది. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధి. ఆయన మాట్లాడుతూ, స్కంద టైటిల్‌కు శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా వుంది. సినిమా అంటే ప్రేక్షకులను థియేటర్‌కు ఎలా రాబట్టుకోవాలనేది చూడాలి. ఈనాటి రోజుల్లో పెద్ద ఛాలెంజ్‌గా వుంది ప్రేక్షకులను తీసుకురావడం. నేను చేసే ప్రతి పనీ, ఆలోచన విధానాన్ని అభిమానిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు.
సింహా, లెజెండ్, అఖండ సినిమా చేశాం. దాని తర్వాత బోయపాటి శ్రీను మరో సినిమా చేయాలి. . వీరసింహారెడ్డి చేశాను. విజయాన్ని సాధించింది. కొత్త నేపథ్యాలను ఆదరిస్తున్న రుచి ప్రేక్షకులకు వుంది. తెలుగు సినిమాకు విదేశాల్లో కూడా బ్రహ్మరథం పడుతున్నారంటే నాన్నగారి సినిమానుంచి ప్రారంభమైంది. ఆనాడే నాన్నగారు ప్రయోగాలు చేశారు. ఈవాళ ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని తెలంగాణ నేపథ్యంతో సినిమా చేసి నాకు ఛాలెంజ్ విసిరాడు.
నేను భగవంత్ కేసరి తెలంగాణ నేపథ్యం చేశా. నేను ఇప్పుడు డిగ్రీ చేశాను. రామ్ తెలంగాణ నేపథ్యంతో నాకంటే ముందుగానే ఇస్మార్ట్ కు సీక్వెల్‌లా పి.జి. చేశాడు. అలాగే ఇస్రో విడుదల చేసిన రాకెట్‌లో తెలంగాణ బిడ్డ ముఖ్యుడు. సనిమాల ద్వారా వినోదమే కాదు. సూక్ష్మంగా విశ్లేషించాలి. ఇక స్కంద సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను అన్నారు.