Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందాలారబోశాను నిజమే... అందుకుని మొత్తం విప్పేయాలా: రకుల్

అటు టాలీవుడ్‌లోనూ ఇటు కొలీవుడ్‌లోనూ నటిస్తూ దూసుకుపోతున్న ఈ పంజాబీ సుందరిని మరింత గ్లామర్ పాత్రల్లో నటింపజేయాలని దర్శక నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కానీ రకుల్ అలాంటి వాటికి తాను దూరమని తేల్చి చెప్పేసింది. మార్కెట్లో అవకాశాలు లేవని ఇంతకుముందు

అందాలారబోశాను నిజమే... అందుకుని మొత్తం విప్పేయాలా: రకుల్
హైదరాబాద్ , బుధవారం, 22 మార్చి 2017 (04:43 IST)
టాలీవుడ్‌లో అడుగుపెట్టింది మొదలు వరుసగా జాక్‌పాట్ కొడుతున్న అందమైన నటి రకుల్ ప్రీత్ సింగ్. ఒదిగి పనిచేయడంలో, పాత్రలో లీనమవడంలో తమన్నాను మించిపోయిన ఈ అందాలరాశికి ఒకదాని వెనుక ఒకటిగా అవకాశాలు తన్నుకొస్తూనే ఉన్నాయి. రెండేళ్లవరకు ఖాళీ లేనంతగా అవకాశాలు కొల్లగొట్టేసిన ఈ ముద్దుగుమ్మ అవకాశాలు లేక అలా విరగదీశాను కానీ అందాలను ఆరబోయాల్సిన ఖర్మ నాకేంటి అనేసింది.
 
అటు టాలీవుడ్‌లోనూ ఇటు కొలీవుడ్‌లోనూ నటిస్తూ దూసుకుపోతున్న ఈ పంజాబీ సుందరిని మరింత గ్లామర్ పాత్రల్లో నటింపజేయాలని దర్శక నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కానీ రకుల్ అలాంటి వాటికి తాను దూరమని తేల్చి చెప్పేసింది. మార్కెట్లో అవకాశాలు లేవని ఇంతకుముందు కాస్త గ్లామరస్‌గా నటించను కానీ ఇప్పుడు ఆ అవసరం లేదనటంతో నిర్మాతలు నివ్వెరపోతున్నారు. 
 
నిజమే మొదట్లో అందాలారబోశాను. అప్పట్లో నాకు నటిగా పరిపక్వత లేదు. ఎలాగైనా మార్కెట్‌ను సంపాదించుకోవాలన్న ధ్యేయంతో అలాంటి పాత్రల్లో నటించాను. ఇప్పుడు నేను ప్రముఖ నటిగా ఎదిగాను. ఇక స్కిన్‌ షోలతో నా స్థాయిని నిలబెట్టుకోవాలనుకోవడం లేదు. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అలాంటి పాత్రలే ఎంపిక చేసుకుని నటిస్తున్నాను అంటూ నయగారాలు పోతున్న రకుల్‌ని చూసి నిర్మాతలు, దర్శకులు వామ్మో వామ్మో అంటూ ఆశ్చర్యపోతున్నారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తెలుగు స్పష్టంగా నేర్చుకుని పరభాషా నటీమణులకు ఈర్ష్య కలిగించిన రకుల్ నట జీవితం ఇలాగే సాగిపోవాలని కోరుకుందాం
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి-2 భావోద్వేగాలకు దూరమైందా.. ఒక్క రొమాంటింక్ పాట కూడా లేదా?