Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలి-2 భావోద్వేగాలకు దూరమైందా.. ఒక్క రొమాంటిక్ పాట కూడా లేదా?

తొలిభాగంలో రమణీయ పాటలతో, అద్బుతమైన రొమాంటిక్ గీతాలతో అదరగొట్టిన బాహుబలి చిత్రం రెండో భాగంలో ప్రణయ దృశ్యాలు, రొమాంటిక్ సంఘటనలకు దూరం జరిగిందా? తొలిభాగంలో తమన్నా పరువాలను ఓ పాటలో అద్భుతంగా చూపించిన జక్క

బాహుబలి-2 భావోద్వేగాలకు దూరమైందా.. ఒక్క రొమాంటిక్ పాట కూడా లేదా?
హైదరాబాద్ , బుధవారం, 22 మార్చి 2017 (03:06 IST)
తొలిభాగంలో రమణీయ పాటలతో, అద్బుతమైన రొమాంటిక్ గీతాలతో అదరగొట్టిన బాహుబలి చిత్రం రెండో భాగంలో ప్రణయ దృశ్యాలు, రొమాంటిక్ సంఘటనలకు దూరం జరిగిందా? తొలిభాగంలో తమన్నా పరువాలను ఓ పాటలో అద్భుతంగా చూపించిన జక్కన్న, రెండవ భాగంలో అనుష్కతో కూడా ఇలాంటి ఓ పాట పెడతారని అందరూ అనుకున్నారు కానీ, మంగళవారం విడుదల చేసిన పాటల జాబితాను పరిశీలిస్తే  ‘బాహుబలి దేవసన’లు పాటలు పాడుకోవడానికి కూడా సమయం లేకుండా రాజమౌళి కధను తీర్చిదిద్దినట్లు కనబడుతోంది. 
 
ఒక్కటి మాత్రం ప్రత్యేకంగా కనపడుతోంది. ‘బాహుబలి’ ది బిగినింగ్‌లో గ్లామర్‌కి సంబంధం లోని మొరటు రూపంలో కనిపించిన అనుష్క, రెండవ భాగంలో మాత్రం అదిరిపోయే రేంజ్‌లో కనపడనుందన్న విషయం ఇప్పటికే అందరికీ అర్థమైంది. ‘బాహుబలి’ని ప్రేమించిన యువతిగా కనపడనున్న అనుష్క – ప్రభాస్ ల మధ్య ఒక్క డ్యూయెట్ సాంగ్ కూడా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
తాజాగా కీరవాణి విడుదల చేసిన బాహుబలి 2 ట్రాక్ లిస్టును పరిశీలిస్తే… ఒక్క ‘కన్నా నిదురించారా’ అనే పాట తప్ప మిగతా నాలుగు పాటలు ఒక్కొక్కరు పాడినవే ఉండడం విశేషం. అలాగే ‘కన్నా నిదురించారా’ అన్న సాహిత్యం బట్టి చూస్తే, ఇది కూడా డ్యూయెట్ సాంగ్ అయ్యే అవకాశం లేదు. దీంతో ‘బాహుబలి 2’లో రొమాంటిక్ సాంగ్ కు ఆస్కారం లేదన్న విషయం అర్ధమవుతోంది. 
 
పోతే.. బాహుబలి పాటల ఆల్బమ్‌ను విడుదల చేయడానికి సర్వహంగులు సిద్ధం చేస్తోంది చిత్ర యూనిట్. ఈ ఆదివారం నాడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆడియో వేడుకను అంగరంగ వైభవంగా జరపనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జక్కన్నే స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఈ పాటల జాబితాను చూస్తుంటే ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ కంటెంట్‌కి ప్రాధాన్యం ఉన్న భావోద్వేగ కధగా కనపడుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ప్రైవసీ నాది. దాంతో ఇతరులకు ఏం సంబంధం అంటున్న అనుష్క