Pushpa2 First Single poster
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా పుష్ప 2 . దీనికి సంబంధించిన తాజా అప్ డేట్ కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ ప్రకటించింది. రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ అల్లు అర్జున్ లేటెస్ట్ పోస్టర్ ను విడుదలచేసింది. ఇటీవలే ఈ సినిమాలో ఐటెం సాంగ్ ను హైదరాబాద్ శివార్లోని ఓ రిసార్ట్ లో చిత్రీకరించారు. ఇప్పుడు టాకీ పార్ట్ జరుగుతోంది.
కాగా, పుష్ప ఫస్ట్ సింగిల్ ఫైరింగ్ రేపు సాయంత్రం 5.04 గంటలకు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం & బెంగాలీ భాషల్లో విడుదలకాబోతుంది. దీనిని టైటిల్ కు చెందిన పాటగా చిత్ర యూనిట్ తెలియజేసింది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇది సినిమాకు హైలైట్ గా వుంటుందట. ఇక పుష్ప 2 ది రూల్ సినిమాను 15 ఆగస్టు 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక మందన్నా ఇందులో సరికొత్తగా కనిపించనుంది. బిఫోర్ పార్ట్ కంటే ఇందులో మెచ్చూర్డ్ గా కనిపిస్తూ పుష్ప కు ట్విస్ట్ ఇచ్చే పాత్ర అని చిత్ర యూనిట్ తెలుపుతోంది. సుకుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.