Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేడ తీసుకుంటూ వుండేదాన్ని, పుష్పతో సుకుమార్ గారు నన్నిలా చేసారు: కల్పలత

Advertiesment
పేడ తీసుకుంటూ వుండేదాన్ని, పుష్పతో సుకుమార్ గారు నన్నిలా చేసారు: కల్పలత
, శనివారం, 25 డిశెంబరు 2021 (20:20 IST)
సినిమాల్లో నటించే నటీనటులకు సంబంధించి తెరపై ఒక విధంగా తెర వెనుక మరో విధంగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అందులోను క్యారెక్టర్ ఆర్టిస్టుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. హీరోహీరోయిన్లకు అత్తగా, లేకుంటే అమ్మగానో, అక్కగానో... ఇలా రకరకాల క్యారెక్టర్లను చేస్తుంటారు. 

 
కానీ అలాంటి వారు పడిన కష్టాలు ఎన్నో వుంటాయి. అలాంటి వారిలో కల్పలత ఒకరు. ఈమె ఒకే ఒక్క సినిమాతో బాగానే పాపులర్ అయ్యారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తల్లిగా నటించారు కల్పలత. మొన్నటివరకు ఈమె ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులకు సుకుమార్ ఒక్కసారిగా పరిచయం చేశారు. ఆమె చేసిన క్యారెక్టర్‌కు మంచి మార్కులే వచ్చాయి. అయితే ఆమె ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాల్లో నటించాలన్న తన కోరికకు భర్త సహకరించారని చెప్పుకొస్తోంది.

 
అయితే చేతిలో డబ్బులు లేక పంజాగుట్ట నుంచి కూకట్ పల్లి వరకు నడిచిన సందర్భాలు గుర్తుచేసుకున్నారు. ఐతే తమది పెద్ద వ్యవసాయ కుటుంబమని అన్నారు. ఇప్పటికీ తమకు 8 గేదెలు, రెండు ఆవులు, ఎడ్లబండి ఉందంటున్నారు. అంతేకాదు తమ కుటుంబం మొత్తం వ్యవసాయ కుటుంబమని.. 20 ఎకరాల పొలం ఉందని, భర్త వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారని చెబుతోంది.  

 
తెలంగాణా రాష్ట్రం ఖమ్మంజిల్లా మణుగూరు స్వస్థలంలో పుట్టిన తాను ఇప్పటికీ సాదాసీదాగా ఉన్నానంటోంది.  10వ తరగతిలోనే మ్యారేజ్ అయ్యిందని.. ఇద్దరు కుమార్తెలు యుఎస్‌లో చదువుకుంటున్నట్లు చెబుతోంది. అయితే అమ్మ, నాన్న ఇద్దరూ చనిపోవడం తనను తీవ్రంగా ఇప్పటికీ బాధిస్తోందంటున్నారు కల్పలత. తనలాగా సినీపరిశ్రమలో ఇంకా ఎంతోమంది కష్టపడుతూనే ఉన్నారని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్యోతిష్కులు రాధే శ్యామ్ గురించి ఏమి చెప్పారో తెలుసా