బిగ్ బాస్ రియాల్టీ షో రసవత్తరంగా మారింది. వచ్చేవారం ఎలిమినేషన్ కోసం ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో పునర్నవి, హిమజ, శ్రీముఖి, శిల్పా చక్రవర్తి, మహేశ్ నామినేట్ అయ్యారు. రవి కూడా నామినేట్ అయినప్పటికీ కెప్టెన్ బాబా భాస్కర్ తన విశేష అధికారాలను ఉపయోగించి.. అతడిని సేవ్ చేశాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా ప్రోమోను విడుదల చేసింది.
అందులో బిగ్‌బాస్‌పై పునర్నవి భూపాలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ''మీ గేమ్ మీరే ఆడుకోండి" అని కోపంతో విరుచుకుపడింది. అంతకుముందు బిగ్ బాస్ హౌస్‌లోని గార్డెన్ ఏరియాలో పునర్నవి కూర్చుంది. వెనక నుంచి బాబా భాస్కర్, శిల్ప, వితిక, హిమజ వచ్చి ఆమెను అమాంతం ఎత్తుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తారు. అనంతరం పూల్ నుంచి బయటకు వచ్చిన పునర్నవి.. హౌజ్‌మేట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అది ఒకవేళ టాస్క్ అయినప్పటికీ.. అలా మ్యాన్‌హ్యాండ్లింగ్ చేయడమేంటని మండిపడింది. బిగ్‌బాస్ ఇవేం టాస్కులు అంటూ మండిపడటమే కాకుండా.. మీ గేమ్‌ని మీరే ఆడుకోమని.. వాకౌట్ చేసినట్లుగా ప్రోమోలో చూపించారు. మరి హౌస్‌లో ఏం జరిగింది? పునర్నవి నిజంగానే వాకౌట్ చేసిందా? అనేది తెలియాలంటే టుడే ఎపిసోడ్ చూడాల్సిందే.