మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఇంకా ఐదు రోజులు వుండగా ఇప్పటికే వాడిగా వేడిగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయమే ప్రకాష్‌రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి పోస్టల్ బేలట్ ఓటింగ్ లో 60 మంది సభ్యులకు 56 మంది ఓట్లను మంచు విష్ణు వేయించుకున్నారని విమర్శించారు. దీనిపై మంచు విష్ణు, సీనియర్ నరేశ్ సాయంత్రం వివరణ ఇచ్చారు.
ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ, `మా`ను రెండుగా చీల్చడానికి ప్రకాష్‌రాజ్ ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు ఎవరైనా బిపి మాత్ర ఇస్తే బాగుంటుంది. అపరిచితుడు గా ప్రవర్తిస్తున్నాడు. చిన్న చిన్న విషయాల కు మా పరువు తీస్తున్నాడు. రియల్ లైఫ్ లో కూడా యాక్ట్ చేస్తారు. ఇప్పటి పరిస్థితిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దని ఎలక్షన్ కమిషన్ కి చెప్పాను. మా ప్యానెల్ సభ్యులు కూడా పేపర్ బ్యాలెట్ కి వెళదాము అని చెప్పారు.
ఇందులో తప్పేముంది. ఎలక్షన్ కమిషన్ కూడా 60సంవత్సరాలు పై బడిన వారికి పోస్టల్ ఓట్ వుంది అని చెప్పింది. దాదాపు 180 నుంచి 190 మంది దాకా 60సంవత్సరాలు దాటిన వారే సభ్యులుగా వున్నారు. వాళ్లకు నేను కాల్ చేసి మాట్లాడాను. వాళ్ళల్లో కొందరు వస్తాము ఓటు వేస్తామనీ, మరి కొందరు పోస్టల్ బ్యాలెట్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ మీకు పోస్టల్ బ్యాలెట్ కావాలి అంటే 500 రూపాయలు కట్ట మన్నారు. అది రూల్‌గా పెట్టుకున్నాం.
ఈ విషయమై పరుచూరి బ్రదర్స్, సత్యం యాబి లాంటి పెద్ద వారు నాకు కాల్ చేసి ఇదేంటి 500 అంటున్నారని అడిగారు. నేను మి తరుపున కట్టిస్తాను మీరు తరువాత పంపించండి అని చెప్పాను. ఆ విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడతాడు. పెద్దలకు గౌరవం ఇవ్వలేని వాడు ఏమి చేస్తాడు. కృష్ణ, కృష్ణంరాజు నీ ప్రకాశ్ రాజ్ అవమానిస్తున్నారు. తమిళ్ కన్నడ మలయాళ ఇండస్ట్రీ లో ప్రకాష్ రాజ్ గురించి ఎవరినదిగినా చెపుతారు. అందుకే ప్రకాశ్ రాజ్ మాట్లాడేది చాలా తప్పు.
ఓటు అడిగే హక్కు నాకుంది నేను రైట్ వే లో వున్నాను. ఇక్కడ `మా` కుటుంబాన్ని పాడు చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. సినిమా తీసేటప్పుడు ఫ్లాప్ అవుతాది అని ఎవ్వరూ చెయ్యరు. సక్సెస్ అనే చేస్తారు. ఈ ఎన్నిక కూడా అంతే. ఇక జీవిత గారు మీరు చెప్పేది కరెక్ట్ గా వుంటేనే చెప్పండి. నాలుగు రోజులు ముందు రాజశేఖర్ గారు వచ్చి మోహన్ బాబు గారితో ఏమి చెప్పారో మీకు తెలీదు. మీరు తెలుసుకుని మాట్లాడండి.
ఉమ్మడి కుటుంబం లో కొన్ని సమస్యలు వుంటాయి వాటిని రోడ్డు మీదకు తీసుకు రావద్దు. ఏదైనా వుంటే నా గురించి మాట్లాడండి కానీ నా ఫ్యామిలీ గురించి మాట్లాడ వద్దు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అసలు శ్రీహరి గారు వుంటే ఈ రోజు వేరేలా ఉండేది. ఆరోజు ప్రకాష్ రాజ్ నీ నాన్న గారి దగ్గరకు ఆయనే తీసుకొచ్చారు. నాకు నా తండ్రి సపోర్ట్ వుంది అంటూ వివరించారు.
నరేష్ ఘాటు కామెంట్స్..
గతంలో జరిగిన ఎలక్షన్స్ బాగానే జరిగాయి. కానీ ఇప్పుడు ప్రతి విషయాన్ని తెగే దాకా లాగుతున్నారు. అలాంటి ఒక బ్యాచ్ తయారైంది. అది `మా`నీ నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ నీ కోరుతూ విష్ణు లెటర్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ చేసేవి ప్రెస్తేషన్ రాజకీయాలు. ఒక మంచి వాడు తెలుగు వాడు `మా` కు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అందుకే ఒక మంచి వారసుడు విష్ణు లాంటి వాడు కావాలి. ఇక ప్రకాష్‌రాజ్ నీకు చెప్పేది ఒక్కటే, నీ చుట్టూ అప్పులు వున్నాయి. అందుకే నువ్వు ఇక్కడ ఏదేదో చేస్తాను అంటున్నావు. మతి స్థిమితం లేని ప్రకాశ్ రాజ్‌కు ఎన్నికలు అవసరమా? అంటూ ఘాటుగా స్పందించారు.