Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాదులో ప్రభాస్ "ప్రాజెక్ట్ K" మరో షెడ్యూల్ పూర్తి!

Prabhas
, శనివారం, 23 జులై 2022 (19:38 IST)
Prabhas
పాన్ ఇండియన్ నటుడు ప్రభాస్ బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి2, సాహో చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, ప్రాజెక్ట్  కె, సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు. ముఖ్యంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ K మరో షెడ్యూల్‌ షూటింగ్‌ను ముగించుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది.
 
హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ Kకు సంబంధించిన మరో షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ దాదాపు ఒక వారం పాటు జరిగింది, జూలై 21 న రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించబడిందని సినీ యూనిట్ తెలిపింది. ఈ షెడ్యూల్‌లో ప్రధానంగా ప్రభాస్‌కు సంబంధించిన సోలో సన్నివేశాలు, దీపికతో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఇకపోతే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా మొదటిసారిగా జంటగా కనిపించనున్నారు.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామారావుకి మోరల్ సపోర్ట్, గైడ్‌గా ఉంటా -దివ్యాంశ కౌశిక్‌