Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్‌ను జేసీబీతో కూల్చేస్తారా?

Advertiesment
హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్‌ను జేసీబీతో కూల్చేస్తారా?
, మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:42 IST)
హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్‌ను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గం భూమి ప్రభుత్వానిదేనంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో.. అదే భూమిలో అక్రమ కట్టడంగా వున్న ప్రభాస్ గెస్ట్ హౌస్‌ను అధికారులు సీజ్ సంగతి తెలిసిందే. అయితే ఆక్రమిత ప్రాంతాల్లో ఇతర గోడలను పగలకొట్టిన అధికారులు ప్రభాస్ గెస్ట్ హౌస్‌ను మాత్రం కూల్చకుండా వదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. 
 
అక్రమ భూమిలో అక్రమంగా కట్టడంగా వున్న హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్‌ కట్టారు. ఇక ఇదే సమయంలో ఆక్రమిత స్థలాల్లో ఉన్న ప్రహరీ గోడలను, ఇతర గదులను, పశువుల పాకలను జేసీబీలను తెచ్చి మరీ కూల్చి వేసిన అధికారులు ప్రభాస్ గెస్ట్ హౌస్ గేటుకు తాళం వేసి, నోటీసులు అంటించి వెళ్లడం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. దీనిపై శేరిలింగపల్లి తహసీల్దార్ వాసుచంద్ర వివరణ ఇచ్చారు. 
 
ప్రభాస్ గెస్ట్ హౌస్ వద్ద ఎవరూ లేకపోవడంతోనే గేటుకు నోటీసు అంటించామన్నారు. ఎన్నికలు ముగియడంతో త్వరలో ప్రభాస్ గెస్ట్ హౌస్‌ను తొలగించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షూటింగ్‌లో ఆ హీరోను అన్నా అని పిలిచిన సాయిపల్లవి...?