ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? చాలా సంవత్సరాల నుంచి ఇది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు బాహుబలి 2 రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని గతంలో ప్రకటించారు. బాహుబలి 2 రిలీజ్ అయినప్పటికీ ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ రాలేదు. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి ఓ వార్త బయటకు వచ్చింది.
అది ఏంటంటే... అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడబోతున్నాడనేదే ఆ వార్త సారాంశం. ఇప్పటికే పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు.
అయితే... ప్రచారంలో ఉన్న ఈ వార్త పైన ప్రభాస్ నుంచి కానీ, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి... ఈ వార్త నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.