Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ ఓ 'మ్యాడ్ ఫెలో'... 'బాహుబలి' మళ్లీ తీయాంటే అలాంటోడు దొరకాలి కదా!: రాజమౌళి

హీరో ప్రభాస్‌ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ 'మ్యాడ్ ఫెలో'గా అభివర్ణించారు. ఇలాంటి పిచ్చోడు మళ్లీ దొరికితేనే 'బాహుబలి' వంటి చిత్రాన్ని మళ్లీ తీయగలుగుతానని రాజమౌళి వ్యాఖ్యానించారు. ప్రభాస్‌ లేకపోతే ఈ

Advertiesment
Baahubali SS Rajamouli
, సోమవారం, 10 ఏప్రియల్ 2017 (09:50 IST)
హీరో ప్రభాస్‌ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ 'మ్యాడ్ ఫెలో'గా అభివర్ణించారు. ఇలాంటి పిచ్చోడు మళ్లీ దొరికితేనే 'బాహుబలి' వంటి చిత్రాన్ని మళ్లీ తీయగలుగుతానని రాజమౌళి వ్యాఖ్యానించారు. ప్రభాస్‌ లేకపోతే ఈ సినిమాయే లేదని చెప్పారు. 'బాహుబలి-2' తమిళ వెర్షన్ ఆడియో ఆవిష్కరణ కోసం చెన్నైకి వచ్చిన యూనిట్‌ సభ్యులు చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. రాజమౌళి, ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా రాజమౌళి స్పందిస్తూ ‘బాహుబలి’లాంటి సినిమాలను మళ్లీ మళ్లీ తీయడం సాధ్యం కాదనీ, ప్రభాస్‌లాంటి పిచ్చోడు (మ్యాడ్‌ ఫెలో) ఉంటేనే ఇలాంటి సినిమాలు తీయడం సాధ్యమపడుతుందన్నారు. అవార్డుల గురించి తాను సినిమాలు తీయనని, ఒకవేళ వస్తే సంతోషమేనని వ్యాఖ్యానించారు. 
 
'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న తనను ఎంతోమంది అడుగుతున్నారని, అయితే ఎవరూ తన నుంచి జవాబు ఆశించడం లేదన్నారు. ‘బాహుబలి’ కొనసాగింపు కథ ఏంటో తెలుసుకొనేందుకు విడుదల కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారనీ, అదే తమ తొలి విజయమనీ చెప్పారు. ‘బాహుబలి’ తర్వాత వీఎఫ్‌ఎక్స్‌ అవసరం లేని కథతో సినిమా తీయాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏదో ఓ రోజున రజనీకాంత్‌తో సినిమా తీస్తా : ఎస్ఎస్ రాజమౌళి