Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏదో ఓ రోజున రజనీకాంత్‌తో సినిమా తీస్తా : ఎస్ఎస్ రాజమౌళి

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఏదో ఓ రోజున ఖచ్చితంగా సినిమా తీస్తానని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. బాహుబలి2 తమిళ ఆడియో విడుదల కార్యక్రమానికి ముందు చెన్నైలో విలేకరులతో రాజమౌళి మాట్లాడారు.

ఏదో ఓ రోజున రజనీకాంత్‌తో సినిమా తీస్తా : ఎస్ఎస్ రాజమౌళి
, సోమవారం, 10 ఏప్రియల్ 2017 (09:33 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఏదో ఓ రోజున ఖచ్చితంగా సినిమా తీస్తానని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. బాహుబలి2 తమిళ ఆడియో విడుదల కార్యక్రమానికి ముందు చెన్నైలో విలేకరులతో రాజమౌళి మాట్లాడారు. ‘‘సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఏదో ఒకరోజు సినిమా తీస్తా’’ అని రాజమౌళి తన మనసులో ఉన్న మాటను వెల్లడించారు.
 
ఇకపోతే... దర్శకుడు శంకర్‌కు తనకు ఎలాంటి పోలిక లేదన్నారు. అలాగే రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 2.Oకు తన చిత్రానికి ఎలాంటి పోలిక లేదన్నారు. ఏ చిత్ర కథ ఆ చిత్రానిదేనని, ఎవరి దర్శకత్వ తీరు వారిదేనని, ఇక్కడ పోలిక అంటూ లేదన్నారు. 
 
కాగా, బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించాడు. అయితే బాహుబలి పార్ట్-1 విడుదలైన మంచి హిట్ టాక్ వచ్చినప్పటి నుంచి బాలీవుడ్, కోలీవుడ్ నటులతో రాజమౌళి సినిమా చేయబోతున్నారని అనేక వార్తలు, ఊహాగనాలు వస్తున్న విషయం తెల్సిందే. వీటిని నిజం చేసేలా రాజమౌళి ప్రకటన చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి-2కి అమెరికా నీరాజనం: 800 థియేటర్లలో విడుదల.. ఆల్ టైమ్ రికార్డ్