Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసిఫాలాంటి పసిమొగ్గలపై అత్యాచారాలు చేసే నీచనికృష్టులు ఎందుకు ఉండరు?

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం కీలక మలుపుతిరిగింది. ఈ అంశంపై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డికి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఓ సలహాతో ఈ సమస్య మరింత జఠిలంగా మారింది.

అసిఫాలాంటి పసిమొగ్గలపై అత్యాచారాలు చేసే నీచనికృష్టులు ఎందుకు ఉండరు?
, శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (09:03 IST)
క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం కీలక మలుపుతిరిగింది. ఈ అంశంపై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డికి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఓ  సలహాతో ఈ సమస్య మరింత జఠిలంగా మారింది. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రంగప్రవేశం చేసి, ఈ విషయంలో శ్రీరెడ్డిది తప్పేమీ లేదనీ, తన ప్రోద్బలంతోనే ఆమె పవన్‌ కల్యాణ్‌ను, ఆమె తల్లిని దుర్భాషలాడిందని వివరణ ఇచ్చారు. అలా అనమని తనే సలహా ఇచ్చినట్లు కూడా తెలిపారు. దీనిపై హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అందులోని సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా...
 
"మీకు చదువులు ఉండి, విజ్ఞత ఉండి, కుటుంబాలు ఉండి, అక్కాచెల్లెళ్లు ఉండి, కోడళ్లు, కూతురులు ఉండి పేరు ప్రఖ్యాతలు ఉండి, సంపదను కూడ పెట్టుకొని అన్నింటికి మించి సమజాన్ని ప్రభావితం చేసే స్థాయిల్లో (మీడియా) మాధ్యమాలల్లో ఉన్న మీరు అందరు కలిసి ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మహిళను.. భర్త, పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నా కన్నతల్లిని... ఎవరికి ఉపకారం తప్ప అపకారం అనేది ఆలోచనల్లో కూడా చెయ్యని నాకు జన్మనిచ్చిన తల్లిని.. మీరందరు కలిసి నడిరోడ్డులో ఏ కొడుకు కూడా వినకూడని ఒక తప్పుడు పదాన్ని అనమని సలహాలు చెప్పి, అనిపించి, దానిని పదే పదే ప్రసారం చేసి, ఆ తర్వాత దానిపైన డిబేట్లు చేసి స్థాయికి మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారిగలిగినప్పుడు...
 
"అసిఫా" లాంటి ముక్కుపచ్చలారని పసిపిల్లలను, అభం శుభం తెలియని పసిపిల్లలపై దారుణమైన అత్యాచారాలు చేసే నీచులు నికృష్టులు ఈ సమాజంలో ఎందుకు ఉండరు? కొల్లలుగా ఉంటారు... మీరందరు కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా... మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి, మీ అక్కచెల్లెళ్లకు, మీ కూతురులకి, కోడళ్ళకి మీ ఇంటిల్లిపాదికి నా హృదయపూర్వక వందనాలు అంటూ పవన్ ట్వీట్ చేశారు.
 
అలాగే, "స్వశక్తితో జీవించేవాడు... ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్దపడితే ఓటమి భయం ఉంటుందా? ఆత్మగౌరవంతో బతికేవాళ్లని, సంవత్సరాలుగా సంబంధంలేని వివాదాల్లోకి పోతుందని భయపడతారా? అధికారంలో ఉన్నవాళ్లకి, మీడియాని చెతుల్లో పెట్టుకున్నవాళ్లకి, అంగబలం,అర్ధబలం ఉన్నవాళ్లకి. వాళ్లు చేసే అత్యాచారాలకి... స్వశక్తితో జీవించేవాడు... ఆత్మగౌరవంతో బతికేవాడు.. ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్దపడితే అసలు దేనికన్నా భయపడుతాడా? వెనకంజ వేస్తాడా? అందుకే... నా ప్రియమైన అభిమానులకు, అక్కాచెల్లెళ్లకు, ఆడపడుచులకు, జసైనికులకు నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు!!
 
ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా నేను చనిపోవడానికి సిద్ధపడి ముందుకెళ్తున్నాను, ఒకవేళ నేను ఈ పోరాటంలో చనిపోతే.. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే "నేను ఎంతో కొంత నిస్సహాయులకి అండగా.. అధికారం అనేది అండదండలు ఉన్న వారికే పనిచేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్య బద్దంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలకు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడు అనుకుంటే చాలు అంటూ నమస్కారంతో పవన్ ట్వీట్ ముగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈసారి ఎగ్జామ్స్‌లో ఫెయిలవుతాను...