Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోసాని మాటలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భార్య.. ఎప్పుడంటే?

Advertiesment
పోసాని మాటలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భార్య.. ఎప్పుడంటే?
, సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (19:11 IST)
పోసాని క్రిష్ణమురళి మాటలు ఎవరు విన్నా వెంటనే అబ్బా.. ఎందుకిలా మాట్లాడుతున్నాడు.. ఇతనికేమైనా తిక్కా అంటూ అనుకుంటుంటారు. ఇది సహజం. ఆయన సినిమాల్లో ఎలా నటించినా.. రాజకీయాల్లో ఎలా ఉన్నా... కుటుంబ సభ్యులతో మాత్రం ఎంతో సఖ్యతగా.. సంస్కారంగా ప్రవర్తిస్తున్నారంటున్నారు ఆయన భార్య కుసుమలత. పోసాని క్రిష్ణమురళి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చకు దారితీస్తోంది. 
 
ఆయనకు కోపమెక్కువ. చూడ్డానికి తిక్క మనిషిలా కనిపిస్తారు. ఆయన కోపాన్ని తట్టుకోలేక పెళ్లైన కొత్తగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకొందట పోసాని కృష్ణమురళి భార్య కుసుమలత. పోసానితో తన పెళ్ళయి 29 సంవత్సరాలు నిండి 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపధ్యంలో కుసుమలత తన భర్త పోసానితో కలిసి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. 
 
పెళ్లైన కొత్తలో ప్రతి చిన్న విషయానికి పోసాని చికాకుపడుతూ ఉండేవాడు. ఆ తిక్క తట్టుకోలేక తాను అప్పట్లో చనిపోవాలని నిర్ణయించుకుని ఆ లెటర్ వ్రాసిన విషయాన్ని తెలియజేసింది. కోపం వచ్చినప్పుడు గొంతు పెంచి మాట్లాడుతాడు తప్ప అతడు ఎంత మంచి వ్యక్తి అన్న విషయం తనకు తెలియడానికి చాల సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చింది.
 
గతంలో తనకు అనారోగ్యం వచ్చి తన ప్రాణానికి ముప్పు అన్న విషయం తెలుసుకుని పోసాని తన కోసం అన్నం.. స్నానం మానివేసి 10 రోజులపాటు హాస్సిటల్స్ చుట్టూ తిరిగారు. అలా తన భర్తను చూసినప్పుడు అతడిని తాను ఎందుకు అపార్ధం చేసుకున్నానా అన్న ఫీలింగ్ కలిగింది. ఒక స్త్రీని పోసాని గౌరవించినంతగా మరెవ్వరు గౌరవించరని పోసాని గురించి గొప్పగా చెప్పుకొచ్చింది కుసుమలత.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనూ ఇమ్మాన్యుయెల్‌కి మళ్లీ ఛాన్స్