Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపైనే పూనమ్ కౌర్ పోస్టు పెట్టిందా? వర్మనూ వదిలిపెట్టలేదుగా!

Advertiesment
పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపైనే పూనమ్ కౌర్ పోస్టు పెట్టిందా? వర్మనూ వదిలిపెట్టలేదుగా!
, గురువారం, 24 ఫిబ్రవరి 2022 (15:06 IST)
టాలీవుడ్‌ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. అవి కాస్త పెద్ద బ్రేకింగ్‌ న్యూస్‌లు అయిపోతుంటాయి. తాజాగా ఆమె చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అయితే..  భీమ్లా నాయక్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్రారంభం అయినప్పటి నుంచి.. పూనమ్‌ కౌర్‌ వరుసగా ట్వీట్లు పెడుతోంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌‌ను టార్గెట్‌ చేస్తూ కామెంట్‌ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లను టార్గెట్‌ చేస్తూ.. వివాద్పద వ్యాఖ్యలు చేసింది పూనమ్‌.
 
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ప్రజలు తమకు నచ్చిన నాయకున్ని ఎన్నుకున్నారు. అలాగే.. చాలా రాజకీయ నాయకులు పెళ్లిళ్ల పై దృష్టి పెట్టారంటూ అర్థం కానీ ట్వీట్‌ చేసింది పూనమ్‌. 
 
అయితే.. ఈ ట్వీట్‌ పై పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఫైర్‌ అవుతున్నారు. తమ హీరోనే అంటుందని పూనమ్‌ పై మండిపడుతున్నారు. పనిలో పనిగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా పూనమ్ ట్వీట్ చేసింది. 
 
అస‌లు కాంట్ర‌వ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌ను పూన‌మ్ కౌర్ ఏమ‌ని కామెంట్ చేసిందంటే?  భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. అందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రిపైనా విమ‌ర్శ‌లు చేయ‌కుండా చాలా జెంటిల్‌గా మాట్లాడారు. 
 
దీనిపై ఆర్జీవీ ట్విట్ట‌ర్ సాక్షిగా రియాక్ట్ అయ్యారు. తాను చూసిన బెస్ట్ స్పీచెస్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడింది ఒక‌టని తెలియ‌జేస్తూ ఆర్జీవీ ఓ యూ ట్యూబ్ లింకును షేర్ చేశారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది.
 
అయితే ఆ త‌ర్వాత పూన‌మ్ కౌర్ రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. "ఒక ద‌ర్శ‌కుడు ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని కామెంట్ చేస్తారు. సైలెంట్‌గా ఉండిపోతారు. మ‌రో ద‌ర్శ‌కుడు ఆయ‌న్ని రాజ‌కీయంగా నాశ‌నం చేయ‌డానికి సిద్ధంగా ఉంటాడు. ట్విట్ట‌ర్‌లో న‌వ్వుతుంటాడు. ఇద్ద‌రూ డ‌బ్బులిచ్చి బాడుగ‌కు తెచ్చుకోబ‌డిన ఏజెంట్లే. వారు మ‌హిళ‌ల‌ను ఆయుధాలుగా వాడుకుంటారు" అని తెలిపారు. 
 
పూన‌మ్ ఇలా రామ్ గోపాల్ ట్వీట్‌ను షేర్ చేస్తూ కామెంట్ చేయ‌డం ఓ ర‌కంగా చాలా మందికి షాకింగ్‌గా అనిపించింది. పూన‌మ్ పంచ్ ఇచ్చిన వారిలో ఓ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ అయితే, మ‌రో ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది ఓ ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే సెట్‌లో 'అన్నయ్య - తమ్ముడు' - 'భీమ్లా నాయక్‌'కు ఆల్ ది బెస్ట్