Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను రవితేజ గుర్తించలేదు కానీ నేను గుర్తించా... పవన్ కళ్యాణ్

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం నేల టిక్కెట్టు. ఈ చిత్రానికి సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేమ్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.ఈనెల 24న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేల టిక్కెట్టు ఆడియో ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ వేడుక‌కు ప‌వన్ క‌ళ్యాణ్ ముఖ్య అత

Advertiesment
నన్ను రవితేజ గుర్తించలేదు కానీ నేను గుర్తించా... పవన్ కళ్యాణ్
, శుక్రవారం, 11 మే 2018 (14:10 IST)
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం నేల టిక్కెట్టు. ఈ చిత్రానికి సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేమ్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.ఈనెల 24న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేల టిక్కెట్టు ఆడియో ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ వేడుక‌కు ప‌వన్ క‌ళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ప‌వ‌న్ మాట్లాడుతూ.. ర‌వితేజ‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 
 
రవితేజ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. రవితేజ నటుడిగా ఎదగడం వెనుక ఎంతో కృషి ఉంది. ఆ కృషిని అభినందిస్తున్నా. ఎంతమంది మధ్యలోనైనా సరే, రవితేజ సిగ్గుపడకుండా అవలీలగా నటించేస్తాడు. నేను అలా నటించలేను. అందుకే, రవితేజ నాకు స్ఫూర్తి అని ప్రశంసించారు. అన్నయ్య చిరంజీవి తర్వాత ఓ నటుడిగా అంత దగ్గరగా రవితేజను మద్రాసులో చూసేవాడిని. 
 
‘ఆజ్ కా గూండా రాజ్’ సినిమా విడుదలైనప్పుడు మద్రాసులో ఈ సినిమాను చూసేందుకు వెళ్లా. అప్పుడు, రవితేజను ఫస్ట్ టైమ్ చూశాను. అప్పటికి నేను నటుడిని కాదు కనుక నన్ను రవితేజ గుర్తించలేదు. రవితేజ అప్పటికే నటుడు కనుక నేను గుర్తించా’ అని పవన్ అనడంతో రవితేజ న‌వ్వు ఆపుకోలేక‌పోయారు. ఈ విధంగా ప‌వ‌న్ ర‌వితేజ‌తో అనుబంధాన్ని నెమ‌ర‌వేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ డైరక్టర్ నన్ను డైరక్టర్ చేయాలని చూశాడు.. మాయ కూడా?: పూనమ్ కౌర్