Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమీర్ ఖాన్ 'దంగల్' గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నా... పవన్ కళ్యాణ్

సామాజిక సమస్యలు, రాజకీయాల పైనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్లో స్పందిస్తారు. కానీ తొలిసారి పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్లో ఓ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆ చిత్ర బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. వసూళ్లను అద్భుతంగా రాబడుతూ దేశంలోనే సంచలనం సృ

Advertiesment
అమీర్ ఖాన్ 'దంగల్' గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నా... పవన్ కళ్యాణ్
, సోమవారం, 2 జనవరి 2017 (18:57 IST)
సామాజిక సమస్యలు, రాజకీయాల పైనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్లో స్పందిస్తారు. కానీ తొలిసారి పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్లో ఓ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆ చిత్ర బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. వసూళ్లను అద్భుతంగా రాబడుతూ దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న అమీర్ ఖాన్ 'దంగల్' చిత్రం గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అమిర్ ఖాన్ ఈ చిత్రంలో అద్భుత నటనని కనబరిచారని, ఆనటనతోనే ఆయన ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల మనసులు గెలుచుకున్నారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.
 
ఈ చిత్రాన్ని చూసిన తరువాత తాను 'దంగల్' గురించి తన అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నానని పవన్ కళ్యాణ్  అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నితీష్ తివారీని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్  అభినందించారు. ప్రేక్షకులు లీనమయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని పవన్ కళ్యాణ్ అన్నారు. మిగతా నటీనటులను, సాంకేతిక బృందానికి కూడా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. 
 
ఈ చిత్రం మహిళల సాధికారత గురించి మనందరం ఆలోచించేలా చేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా తన ట్విట్టర్లో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ రాజకీయ, సామజిక సమస్యల గురించే ట్వీట్లు చేస్తూంటారు. ఓ సినిమా గురించి ట్వీట్ చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో మహిళల సాధికారత గురించి అద్భుతంగా చూపించడంతో చిత్ర బృందాన్నిఅభిందించాలని పవన్ కళ్యాణ్ ఈ చిత్రంపై స్పందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2017‌లో విడుదల కానున్న టాప్-10 తెలుగు చిత్రాలు ఇవే....