Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2017‌లో విడుదల కానున్న టాప్-10 తెలుగు చిత్రాలు ఇవే....

గత 2016లో కంటే 2017 సంవత్సరంలో అనేకమంది అగ్రహీరోల చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిలో టాప్-10 చిత్రాలను పరిశీలిద్ధాం. వీటిలో ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా "ఖైదీ నెం150" ఒకటి కాగా

Advertiesment
Tollywood Top 10 Movie
, సోమవారం, 2 జనవరి 2017 (16:57 IST)
గత 2016లో కంటే 2017 సంవత్సరంలో అనేకమంది అగ్రహీరోల చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిలో టాప్-10 చిత్రాలను పరిశీలిద్ధాం. వీటిలో ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా "ఖైదీ నెం150" ఒకటి కాగా, బాలకృష్ణ 100వ సినిమా "గౌతమిపుత్రశాతకర్ణి" కూడా ఈ యేడాది మొదటి నెలలోనే సంక్రాంతి కానుకగా వెండితెరమీదకు రాబోతోంది.
 
ఇక తెలుగు చిత్రరంగానికి ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన 'బాహుబలి' సీక్వెల్ 'బాహుబలి ద కంక్లూజన్' కూడా ఈ ఏడాదే ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు గతేడాదిలో చేసిన 'శ్రీమంతుడు' సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే, బ్రహ్మోత్సవం నిరాశపర్చింది.
 
ఈ యేడాది 'సంభవామి'తో ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక బాలీవుడ్ బంపర్ హిట్ సాలా ఖర్దూస్‌కు రీమేక్ అయిన.. వెంకటేష్ హీరోగా రెడీ అవుతున్న 'గురు' సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కాబోతోంది. 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ తర్వాత వస్తోన్న పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' కూడా 2017లోనే రానుంది. 
 
'బాహుబలి'తో జాతీయ స్థాయికి చేరిన రానా దగ్గుబాటి మూవీ 'ఘాజీ'. సబ్‌మెరైన్ నేపథ్య కథతో తెరకెక్కుతోన్న మొట్టమొదటి తెలుగు సినిమా ఇదే. 'సరైనోడు'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మాంచి ఊపుమీదున్న బన్నీ కూడా ఈ ఏడాది "దువ్వాడ జగన్నాథం" (డీజే) అంటూ ముందుకురాబోతున్నాడు. 
 
ఇకపోతే.. టాలీవుడ్ మన్మథుడుగా పేరుగాంచిన నాగార్జున... గత యేడాది 'ఊపిరి', 'సోగ్గాడే చిన్నినాయన' వరుస హిట్లతో మాంచి ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు "ఓం నమో వేంకటేశాయ" వంటి భక్తిరస పాత్రలో 2017లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక 'హ్యాపీడేస్' ఫేం నిఖిల్ పూర్తి డిఫెరెంట్ లుక్‌లో కనిపించబోతోన్న సినిమా "కేశవ" కూడా 2017లోనే రిలీజ్ కాబోతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమీర్ "దంగల్" నాటకీయత జోడించి తీశారు.. ఆ సీన్ చూసి ఏడ్చేశాను : గీతా ఫొగాట్