Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమీర్ "దంగల్" నాటకీయత జోడించి తీశారు.. ఆ సీన్ చూసి ఏడ్చేశాను : గీతా ఫొగాట్

భారత రెజ్లర్ మహావీర్‌ సింగ్‌ ఫొగాట్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం అమీర్ ఖాన్ 'దంగల్‌'. ఈ చిత్రంలో మహావీర్‌ సింగ్‌, అతని కూతుళ్లు గీతా ఫొగాట్‌, బబితా కుమారి నిజజీవిత కథలను ఇందులో హృద్యంగా చూపించా

Advertiesment
అమీర్
, సోమవారం, 2 జనవరి 2017 (16:42 IST)
భారత రెజ్లర్ మహావీర్‌ సింగ్‌ ఫొగాట్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం అమీర్ ఖాన్ 'దంగల్‌'. ఈ చిత్రంలో మహావీర్‌ సింగ్‌, అతని కూతుళ్లు గీతా ఫొగాట్‌, బబితా కుమారి నిజజీవిత కథలను ఇందులో హృద్యంగా చూపించారు. ఆ సినిమాలోని ఎమోషన్లు చూసి సామాన్యులే కదలిపోయారు. ఫలితంగా ఈ చిత్రం కనకవర్షం కురిపిస్తోంది. 
 
అయితే, ఈ చిత్రాన్ని చూసిన మహావీర్ పెద్ద కుమార్తె గీతా ఫొగాట్ స్పందిస్తూ... ఈ చిత్రం అంతా బాగున్నా, అందులో ఓ సీన్‌ తనకు నచ్చలేదని, వాస్తవానికి బాగా నాటకీయత జోడించేశారని వ్యాఖ్యానించింది. తండ్రి నేర్పించిన టెక్నిక్కుల కంటే కోచ్‌ చెప్పినవే గొప్పవని నమ్మే గీత ఓ దశలో తండ్రితోనే కుస్తీ పోటీకి దిగుతుంది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఓటమి పాలవుతుంది.
 
ఆ సమయంతా తండ్రికి, గీతకు మధ్య యుద్ధం జరుగుతున్నట్టే చూపించారు. అయితే అదంతా నిజం కాదని చెప్పింది. తన తండ్రితో కేవలం ఒకసారే తలపడ్డానని, అంతటితో అది ముగిసిపోయిందని, కానీ, సినిమాలో బాగా నాటకీయత జోడించేసి తండ్రితో బాగా తలపడినట్లు చూపించారని వాపోయింది. 
 
ఆ సిన్నివేశాలు చూసినపుడు చాలా వేదనకు గురయ్యానని, ఏడ్చానని కూడా గీత చెప్పుకొచ్చింది. మొత్తంమీద సినిమా చాలా అద్భుతంగా ఉందని, కుస్తీ పోటీలను చాలా సహజంగా తెరకెక్కించారని ప్రశంసించింది. తమ జీవితాలను తెరపై చూసుకోవడం చాలా ఆనందం కలిగించిందని గీతా ఫొగాట్ వ్యాఖ్యానించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడో చెబితే నేను చచ్చిపోతాను!: తమన్నా