Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''పద్మావత్'' 25న రిలీజ్: యూ అండ్ ఎ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్

దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ''పద్మావత్'' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమాకు సెన్సార్ విభాగంగా యూ అండ్ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. తద్వారా ఈ నెల 25వ తేదీన ప

Advertiesment
''పద్మావత్'' 25న రిలీజ్: యూ అండ్ ఎ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్
, ఆదివారం, 7 జనవరి 2018 (17:18 IST)
దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ''పద్మావత్'' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమాకు సెన్సార్ విభాగంగా యూ అండ్ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. తద్వారా ఈ నెల 25వ తేదీన పద్మావత్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
 
ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ విభాగం సూచన మేరకు ఈ చిత్ర టైటిల్‌ను పద్మావతి నుంచి పద్మావత్‌గా మార్చేశారు. పద్మావత్ సినిమాలో దీపికా పదుకునే, రణవీర్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమా నిడివి అంతిమంగా 2.43 గంటలు ఉంటుందని సినీ యూనిట్ వెల్లడించింది.
 
వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సింది. అయితే విడుదల తేదీ ప్రకటన సమయంలోనే తీవ్ర వివాదాలు రేగాయి. ఈ సినిమా రూపకర్తలపై రాజ్ పుత్‌లు మండిపడ్డారు. దీపిక ముక్కూచెవులు కోయాలనే పిలుపులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలయ్య ఓ రాజు లెవల్లో ఫీలవుతున్నాడు.. కొట్టడం ఏంటి?: కత్తి మహేష్