Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు" అంటున్న హీరోయిన్

పదహారణాల తెలుగు అమ్మాయి నుంచి టూ పీస్ బికినీ గర్ల్‌గా మారినప్పటికీ ఫలితం దక్కలేదని టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి వాపోతోంది. 'సోగ్గాడే చిన్ననాయనా' చిత్రం తర్వాత ఓ మంచి హిట్ కోసం ఆ భామ పరితపిస్తోంది

Advertiesment
Lavanya Tripathi
, బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (17:22 IST)
పదహారణాల తెలుగు అమ్మాయి నుంచి టూ పీస్ బికినీ గర్ల్‌గా మారినప్పటికీ ఫలితం దక్కలేదని టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి వాపోతోంది. 'సోగ్గాడే చిన్ననాయనా' చిత్రం తర్వాత ఓ మంచి హిట్ కోసం ఆ భామ పరితపిస్తోంది. ఇందుకోసం తన అందాల అమ్ముల పొదిలో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించింది. ఇందుకోసం శృంగార డోస్ కూడా పెంచింది. అయినప్పటికీ ఫలితం దక్కలేదని వాపోతోంది. 
 
నిజానికి ఈ భామ వెండితెర అరంగేట్రం చేసిన కొత్తల్లో ఈమె నటించిన ప్రతి చిత్రం విజయాన్ని అందుకుంది. కానీ ఈ మధ్య వరుస పరాజయాలతో అమ్మడు డీలా పడిపోయింది. విజయం కోసం ఇప్పటివరకూ తన అందాల అమ్ముల పొదిలో ఉన్న అన్ని అస్త్రాల్ని ప్రయోగించింది. కానీ లాభం లేకపోయింది. ఆఖరికి తాజా చిత్రమైన 'ఇంటిలిజెంట్' కూడా ఆమెను పరాజయం బారి నుంచి తప్పించలేకపోయింది. 
 
గత యేడాది 'మిస్టర్'తో లావణ్య పరాజయాల ఖాతను తెరిచింది. ఆ తర్వాత వరుసగా 'యుద్ధం శరణం', 'రాధ', 'ఉన్నది ఒకటే జిందగీ'లాంటి సినిమాలన్నీ పూర్తిగా నిరాశపరచడంతో సాయిధరమ్ తేజ, వి.వి.వినాయక్ కాంబో మూవీ 'ఇంటిలిజెంట్' మీదే అన్ని ఆశలూ పెట్టుకుంది. అయితే ఆమె ఆశలన్నీ వమ్ము చేసి 'ఇంటిలిజెంట్' కూడా పరాజయాల లిస్ట్‌లోకి చేరిపోవడంతో లావణ్య ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్‌లో పడింది. 
 
ఈ అమ్మడు ఆది నుంచి తన అందం, అభినయంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. కానీ, వరుస పరాజయాలు పలకరించడంతో అందాల ఆరబోతలోకి కూడా దిగింది. ఇందులోభాగంగా, 'ఇంటిలిజెంట్' చిత్రం కోసం శృంగార డోస్‌ను మరింతగా పెంచింది. అయినా సరే సక్సెస్ మాత్రం దక్కలేదు. అంటే ఆమె పరిస్థితి "వ్రతం చెడ్డా ఫలితం దక్కలేద"న్నమాట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'రేయ్ నువ్వు కాదురా.. యాక్టర్స్ రా'... హీరోను అలా అనేసి నిత్యామీనన్