Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊపిరితిత్తుల్లో నిమ్ము నుండి బ‌య‌ట‌ప‌డ్డ ప‌వ‌న్‌!

Advertiesment
ఊపిరితిత్తుల్లో నిమ్ము నుండి బ‌య‌ట‌ప‌డ్డ ప‌వ‌న్‌!
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (17:27 IST)
pavan kalyan-1
ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రాజ‌కీయ పార్టీ కార్య‌క‌లాపాల‌లో తిర‌గ‌డంవ‌ల్ల వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల ఆయ‌న‌కు జ్వరంతోపాటు ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందని డాక్టర్లు తెలిపారు. ఆయనకు యాంటీ వైరల్‌ డ్రగ్స్, అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ అందించారు. ఇలా వైద్యుల పర్యవేక్షణతో పాటు కుటుంబ సభ్యుల పర్యవేక్షణతో ఆయన త్వరగా కోలుకున్నారు. హైదరాబాద్‌ దగ్గర్లోని తన వ్యవసాయక్షేత్రంలో డాక్టర్ల సమక్షంలో చికిత్స తీసుకున్నారు. మంగ‌ళ‌వారం నాడు హైదరాబాద్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. అందులో ఆయనకు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే అభిమానుల ముందుకు వస్తానని పవన్‌ కల్యాణ్‌ అన్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి.
 
ఒక‌వైపు వకీల్‌సాబ్ స‌క్సెస్ వార్త‌లో ఆనందంగా వున్న ఆయ‌న అభిమానుల‌కు కోవిడ్ అన‌గానే త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కొంద‌రు పూజ‌లు కూడా చేశారు. తిరుప‌తికి చెందిన ఆయ‌న అభిమానులు దేవుడ్ని ప్రార్థించారు. సినీ ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు చేశారు. ఎట్టకేలకు వారి పూజలు ఫలించాయి. త్వ‌ర‌లో ఆయ‌న అభిమానుల‌ను క‌ల‌వ‌నున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

`ఏక్ మినీ క‌థ`లో `సామిరంగా.` పాట‌కు విశేష స్పంద‌న‌