ఓ టి టి సంతోషం సినీ అవార్డ్స్‌ను ప్రవేశపెట్టారు సురేష్ కొండేటి. తాజాగా 22వ సంతోషం అవార్డ్సు వేడుకను డిసెంబర్ 2వ తేదీన గోవాలో భారీగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు సురేష్ కొండేటి. అలాగే ఓటీటీ పేరుతో థియేటర్స్‌కు ప్రత్యామ్నాయంగా ప్రేక్షకుడి ఇంటికే వచ్చేసిన వినోదాన్ని కూడా సత్కరింఓ టి టి చి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం సంతోషం`ఓటీటీ అవార్డ్స్ పేరుతో ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలకు సైతం అవార్డులు ఇవ్వడం మొదలు పెట్టారు సురేష్ కొండేటి. ఇటీవలే హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌లో సినీ ప్రముఖుల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మురళీమోహన్, జయసుధ, సంచలన రచయితలు విజయేంద్రప్రసాద్, సత్యానంద్, ఎస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, కె.యస్. రామారావు, జేడీ చక్రవర్తి, వేణు, నిరుపమ్, ఓంకార్, సుహాస్, అనసూయ, హంసానందిని, డిరపుల్ హయత్, జోష్ రవి, దర్శకులు వశిష్ట, సాయిరాజేష్, రేలంగి నరసింహారావు, నిర్మాతలు రాధామోహన్, వాసు, ఎస్‌కెఎన్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టి. ప్రన్నకుమార్, లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథి మురళీ మోహన్ మాట్లాడుతూ... స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవార్డ్స్ విషయంలో రెండు ప్రభుత్వాలు మాకు సంబంధం లేదు అన్నట్లు ఉంటున్నాయి. ఒకప్పుడు నంది అవార్డ్స్ పేరుతో రెగ్యులర్‌గా ఇచ్చేవారు. అది మాకు ఎంతో ప్రోత్సాహకంగా ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ అవార్డ్స్ ఇవ్వడం లేదు. రాష్ట్ర విభజన జరిగినందున ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్ పేరుతో ఇస్తోంది కనుక, తెలంగాణ ప్రభుత్వం మరో పేరే ఏదైనా పెట్టి అయినా అవార్డు ఇవ్వాలి. ఈ అవార్డుల వల్ల లక్షలు, కోట్లు వస్తాయని కాదు. ఒక ప్రభుత్వం కళాకారుల్ని, టెక్నీషియన్స్‌ను ఎంపిక చేసి అవార్డు ఇస్తే కళాకారులు పొంగిపోతారు. దాన్ని అందరికీ చూపించుకోవటం ఎంత గర్వంగా ఉంటుంది. మీరు ఇచ్చే షీల్డ్‌లే కావాలంటే మేం డబ్బులు పెట్టి బజారులో కొనుక్కోవచ్చు. అదికాదు మాకు కావాల్సింది. ప్రభుత్వాలు మా టాలెంట్‌ను గుర్తించాలి. ఎన్నోసార్లు రెండు ప్రభుత్వాలకు చెప్పాం. కానీ పట్టించుకోలేదు. దీనికి లక్షలు, కోట్లు ఖర్చు ఏమీ అవ్వవు.
మన తెలుగు హీరో అల్లు అర్జున్‌కు తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ వచ్చింది. కానీ అటు తెలుగు ప్రభుత్వాలు కానీ.. తెలుగు చిత్ర పరిశ్రమ కానీ ఆయన్ను సత్కరించుకోలేక పోయాం. ఇది నిజంగా బాధాకరం. అలాగే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తే, జాతీయ అవార్డులు కూడా అనేకం వస్తే కనీసం ప్రభుత్వం పిలిచి అభినందించలేదు. అలాగే పరిశ్రమ కూడా వారిని సత్కరించ లేదు. ఇలాంటి పరిస్థితి కళారంగానికి మంచిది కాదు.
ఇక ఓటీటీ ద్వారా గొప్ప నటీనటులు, టెక్నీషియన్‌లు మనకు పరిచయం అవుతున్నారు. మేం 10 సినిమాలు చేస్తే గానీ ట్రాక్‌లో పడలేదు. మీరు మాత్రం 1,2 సినిమాలకే అద్భుతాలు చేస్తున్నారు హేట్సాఫ్. కానీ ఓటీటీ సినిమాలకు సెన్సార్ లేదు కదా అని ఏది పడితే అది తీయకండి. మీరు సెన్సార్ ఉన్నట్లుగానే భావించి సెల్ఫ్ సెన్సార్ చేసుకోండి. ఎందుకంటే మనకు కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఫాలో అయి, గౌరవించినప్పుడే మన మనుగడకు అర్ధం ఉంటుంది. మనతో పాటు మన ఇంట్లో ఆడవారు, పిల్లలు కూడా ఓటీటీలో వచ్చే సినిమాలను మన పక్కనే కూర్చుని చూస్తున్నారు. సిగరెట్లు తాగే సన్నివేశాలు, మందు తాగే సన్నివేశాలు, ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి మందు తాగే సన్నివేశాలు ఇలా చూపించుకుంటూ పోతే ఎలా. దయచేసి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
గతంలో సినిమాలకు మాత్రమే అవార్డులు ఇచ్చేవారు. ఆ తర్వాత టీవీలకు కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ ఈ రెండిరటికీ మూలమైన నాటకాలకు ఇచ్చేవారు కాదు. మేము చాలా సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాటకాలను కూడా నంది అవార్డుల్లోకి చేర్చారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ సినిమా, టీవీ, థియేటర్ ఆర్ట్స్ నంది అవార్డ్స్ అని మార్చారు అని అన్నారు.
అవార్డు విన్నర్స్ :
1. బెస్ట్ మూవీ : ప్రేమ విమానం (నిర్మాత అభిషేక్ నామా)
2. బెస్ట్ యాక్టర్ : జె.డి. చక్రవర్తి (దయ)
3. క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ : వేణు తొట్టెంపూడి (అతిథి)
4. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : ఓంకార్ (మేషన్ 24)
5. బెస్ట్ డైరెక్టర్ : ఆనంద్ రంగా (వ్యవస్థ)
6. బెస్ట్ సపోర్టింగ్ డెబ్యూ ఆర్టిస్ట్ : శ్రీనివాస్ గారిరెడ్డి
7. బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ : జోష్ రవి (దయ)
8. బెస్ట్ సపోర్టింగ్ నటి : అనసూయ (ప్రేమ విమానం)
9. బెస్ట్ విలన్ : సుహాస్ (యాంగర్‌టెయిల్స్)
10. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్ (నిశానీ)
11. బెస్ట్ సినిమాటోగ్రఫీ : వివేక్ కాలెపు (దయ)
12. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ : అనిరుద్, దేవాన్ష్ (ప్రేమ విమానం)