Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాదులో సంతోషం ఓటీటి అవార్డ్స్ - గోవాలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్

Suresh Kondeti
, మంగళవారం, 7 నవంబరు 2023 (16:07 IST)
Suresh Kondeti
ఈ సంవత్సరం డిసెంబర్ 2న గోవాలో సంతోషం ఫిలిం అవార్డ్స్ నిర్వహిస్తున్న సందర్భంగా సంతోషం అధినేత సురేష్ కొండేటి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 18న హైదరాబాదులో  సంతోషం ఓటీటి అవార్డ్స్ - డిసెంబర్ 2న గోవాలో  సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్  చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నాం నాకు సహకరిస్తున్న చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే అందరు హీరోలు అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే సంతోషం ఓటీటీ అవార్డ్స్ కూడా గత ఏడాది  మొట్టమొదటిగా మొదలుపెట్టింది సంతోషం సంస్థ.  రెండవసారి  ఈ సంవత్సరం కూడా ఈ నెల 18వ తారీఖున ఓటీటీ అవార్డ్స్ ని అలాగే డిసెంబర్ 2న గోవాలో సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
 
అనంతరం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ సంతోషం సంస్థ నుంచి 25 సంవత్సరాలు పాటు అవార్డులు కొనసాగించాలని అనుకున్నాను ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతుంది ఇంకో మూడు సంవత్సరాలు కచ్చితంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి అని అన్నారు.

సంతోషం మ్యాగజైన్ మొదలెట్టినప్పుడు నాకు ఇంకా చిన్న వయసు నాగార్జున గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు లాంటి అగ్ర నటీనటులందరూ  ఇచ్చిన ప్రోత్సాహంతో అవార్డ్స్ మొదలుపెట్టాను టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు సంతోషం సురేష్ కొండేటి కూడా ఫిలింఫేర్ స్థాయిలో అవార్డ్స్ నిర్వహించగలడు ఆయన నా పై ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనుకున్నాను

అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు లాంటి అగ్ర హీరోలు సురేష్ కొండేటి చేయగలడు అని నా పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇన్నాళ్లు వరకు సంతోషం ఫిలిం అవార్డ్స్ ఎక్కడ ఆగకుండా నిర్వహించాను నిర్వహిస్తున్నాను అని అన్నారు. గోవా గవర్నమెంట్ వాళ్ళు సహకారం మర్చిపోలేనిది. అలాగే ఆ గవర్నమెంట్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ కంటిస్టెంట్ శ్వేతావర్మ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం