`సేవా కార్యక్రమాలను వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అందించాలనే ఆలోచనతో www.chiranjeevicharitabletrust.com వెబ్ సైట్‌తో ఆన్ లైన్ సేవలను ప్రారంభించాం. ప్రస్తుతం అందరం పాండమిక్ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కాబట్టి ప్రజలు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆక్సిజన్ అవసరం అయితే ఆ రిక్వెస్ట్‌ను మాకు పంపొచ్చు. అలాగే రక్తం కూడా ఎవరికైనా అత్యవసరం అయినప్పుడు కూడా ఆన్‌లైన్‌లోనే రిక్వెస్ట్ పంపొచ్చు. అలా చేసినప్పుడు మా బ్యాక్ ఎండ్ టీమ్ వారిని వెంటనే సంప్రదించి, వారికి సపోర్ట్ చేస్తారు. ఆన్‌లైన్‌లోనే రిక్వెస్ట్ ఫారంస్ అందుబాటులో ఉంటాయి` అని రామ్‌చరణ్ తెలియజేశారు.
సోమవారంనాడు జూబ్లీహిల్స్‌లోని బ్లడ్ బేంక్ ఆవరణలో వెబ్‌సైట్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా రామ్‌చరన్ పలు విషయాలను తెలియజేశారు.
- నాన్నగారిపై చాలా వెబ్‌సైట్స్‌ను అభిమానులు స్టార్ట్ చేశారు. అయితే అధికారికంగా ఆయన సినిమాల గురించిన వివరాలు మా వెబ్ సైట్‌లో దొరుకుతుంది. నటుడిగా ఆయన పడ్డ ఇబ్బందులు, సాధించిన విజయాలు, ఆయన జర్నీ .. అలాగే టూరిజం మినిష్టర్‌గా ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు.. ఇలా అన్ని విషయాలను www.kchiranjeevi.com లో చూడొచ్చు అన్నారు.
కంటిని కూడా డొనేషన్ చేయాలంటే!
ఇంకా వివరాలు తెలపుతూ, 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిట్రబుల్ ట్రస్ట్ మొదలైంది. ఈ ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలను 20 ఏళ్లకు పైగా చేసుకుంటూ వస్తుంది. అక్కడ నుంచి ట్రస్ట్ చేసిన సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. బెస్ట్ బ్లడ్ బ్యాంకుగా చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. చాలా గర్వకారణంగా అనిపిస్తుంది.
అలాగే రక్తాన్ని దానం చేయాలనునుకున్న వారు వీలును బట్టి ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని రక్తాన్ని డొనేట్ చేయవచ్చు. అలాగే కంటికి సంబంధించినవి కూడా డొనేషన్ చేయాలనుకున్నవారు రిక్వెస్ట్ పెడితే మేం వెంటనే స్పందిస్తాం. ఇండియాలోని 25 భాషల్లో మా వెబ్ సైట్ ఉంటుంది. అలాగే బడ్ల్ డొనేట్ చేయడానికి వీలుగా ఉండేలా ఆపీసులను హైదరాబాదులోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తాం.
ఒకప్పుడు నాన్నగారిని అభిమానులు తరుచు కలుసుకునేటప్పుడు వారికి ఒక్కొక్కరికి ఫొటోలను ఇచ్చేవారు. అయితే వారిని కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యులు చేయాలనే ఆలోచన రావడంతో రక్తదానం చేసిన వారికి ఫొటో ఇస్తానని చెప్పడంతో అభిమానులు కూడా సపోర్ట్ చేశారు. చాలా మంది అభిమానులు 160..80..50 ఇలా లెక్క పెట్టలేనంతగా సపోర్ట్ చేశారు. చిరంజీవిగారు, అరవింద్‌గారు క్రమంగా విషయాలను తెలుసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఈ ట్రస్ట్‌ను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.