Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగుదేశం పిలుస్తోంది రా... కదలిరా... అచ్చం ఎన్టీఆర్‌లా బాలయ్య

ఎన్టీయార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీయార్ బయోపిక్ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజైంది. బాలయ్య అచ్చం తన తండ్రి ఎన్టీఆర్‌లానే వున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్నాడు. తన తండ్రి నిజ జీవిత పాత్రను తనయుడు పోషిస్తున్నాడు. యన

Advertiesment
NTR BioPic first look
, బుధవారం, 15 ఆగస్టు 2018 (10:03 IST)
ఎన్టీయార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీయార్ బయోపిక్ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజైంది. బాలయ్య అచ్చం తన తండ్రి ఎన్టీఆర్‌లానే వున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్నాడు. తన తండ్రి నిజ జీవిత పాత్రను తనయుడు పోషిస్తున్నాడు. యన్.బి.కె ఫిలింస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. 
 
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నారు. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో బాలయ్య-క్రిష్ కాంబోలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ఘన విజయాన్ని నమోదు చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అందులోనూ బాలయ్యకు ఎంతో అచ్చొచ్చిన సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అందులో బాలకృష్ణ అచ్చం తండ్రిలాగే కనిపించాడు. కాషాయ రంగు దుస్తులు ధరించి మైక్ ముందు నిల్చుని మాట్లాడుతున్న ఎన్టీయార్‌లా కనిపించాడు. ఆ పోస్టర్‌లో బాలయ్య వెనుక త్రివర్ణ జెండా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫస్ట్‌లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
 
‘ఎన్టీఆర్‌’ సినిమాలో మరికొంత మంది తారలు అతిథి పాత్రలో నటించనున్నారు. నారా భువనేశ్వరిగా మంజిమా మోహన్, సావిత్రిగా కీర్తి సురేశ్‌, కృష్ణగా మహేశ్‌బాబు, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్, రామానాయుడుగా వెంకటేశ్ మరియు జూనియర్‌ ఎన్టీఆర్‌గా మోక్షజ్ఞ నటిస్తున్నారని టాలీవుడ్ టాక్. ఇంకా ఇందులో ప్రధాన నటీనటులు నటిస్తుండటం, పైగా ఎలక్షన్‌లు కూడా ఈ చిత్రం విడుదలయ్యే సంవత్సరంలో జరుగుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాశీ ఖన్నాతో ఎవరూ సినిమా చేయవద్దంటున్న బడా నిర్మాత.. ఎందుకు?