బాలయ్యకి కథ రెడీ చేస్తోన్న స్టార్ రైటర్..!
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే...బాలయ్య డైనమిక్ డైరెక్టర్ వినాయక్‌తో సినిమా చేయనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. కథ మాత్రం సెట్ కావడం లేదు.
ఇప్పటివరకు వినాయక్ చాలామంది రైటర్స్‌తో కథ రెడీ చేయించినా... ఆ కథలు బాలయ్యకు నచ్చలేదు. సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ రెడీ చేసిన స్ర్కిప్ట్ కూడా బాలయ్యకు నచ్చలేదట. ఈసారి స్టార్ రైటర్ గోపీ మోహన్‌ని రంగంలోకి దించుతున్నాడట వినాయక్. గోపీ మోహన్ కథ రెడీ చేసాడని... టైమ్ ఇవ్వాలని బాలయ్యని అడిగితే... త్వరలోనే చెబుతా అన్నాడట. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య బోయపాటితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి... గోపీ మోహన్ అయినా బాలయ్యను మెప్పిస్తాడో లేదో చూడాలి.