బాలీవుడ్లో వెలుగు చూసిన మాదక ద్రవ్యాల కేసులో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) క్లీన్ చిట్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఎన్సీబీ స్పందించింది. డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేసింది.
కాగా, మాదక ద్రవ్యాల కేసులో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌లతో పాటు కరీష్మా ప్రకాశ్, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌లు ఆరోపణలు ఎదుర్కొంటారు. వీరిని గత వారం ఎన్సీబీ విచారించింది. ఈ విచారణలో నలుగురు చెప్పిన స్టేట్మెంట్స్ని రికార్డ్ చేశారు.
అయితే దీపికాతో పాటు ఆమె మేనేజర్ కరీష్మా ప్రకాశ్‌ల స్టేట్మెంట్.. ఎన్సీబీ అధికారులకు సంతృప్తిని ఇవ్వడంతో త్వరలోనే వారికి క్లీన్ చీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు పుకార్లు పుట్టుకొచ్చాయి.
కొద్ది సేపటి క్రితం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పుకార్లపై స్పందిస్తూ.. ఎన్సీబీ విచారించిన నలుగురు హీరోయిన్స్‌కు క్లీన్ చీట్ ఇస్తుందని వచ్చిన వార్తలు అర్థం లేనివి. అందులో వాస్తవం లేదు అని పేర్కొన్నారు. 2017లో జరిగిన వాట్సాప్ చాట్‌లో పలు కోడ్స్‌తో జరిగిన చాటింగ్‌పై దృష్టి పెట్టిన ఎన్సీబీ దీపికా, సారా, రకుల్, శ్రద్ధా, కరిష్మా ప్రకాశ్‌లను పలు కోణాలలో విచారిస్తుంది.