నివేదా థామస్, రెజీనా తొలిసారి యాక్షన్ స్టంట్స్ చేస్తున్నారు. కొరియన్ మూవీ మిడ్నైట్ రన్నర్స్`కు రీమేక్‌గా తెలుగు సినిమా చేస్తున్నారు. అందులో వారు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. డి.సురేశ్‌బాబు, సునీతతాటి, హ్యూన్యూ థామస్ కిమ్ కలిసి సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ మిడ్నైట్ రన్నర్స్‌ను తెలుగు రీమేక్‌ను అధికారికంగా నిర్మించనున్నారు.
యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఓ బేబీ మాతృక మిస్‌గ్రానీ చిత్రం మాదిరిగానే, మిడ్‌నైట్‌రన్నర్స్ మూవీ కూడా గ్లోబల్ అప్పీల్ ఉన్న కథాంశం. తెలుగు ప్రేక్షకులకు నచ్చే, వారు మెచ్చే అంశాలు అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా..ఈ చిత్ర దర్శకుడు సుధీర్‌వర్మ తెలుగు ప్రేక్షకుల అభిరుచి, ఆకాంక్షలకు తగ్గట్లుగా కథలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. దీంతో ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌కు తప్పకుండ కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.
ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. కోవిడ్ సెకండ్ వేవ్ లాక్డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు కల్లా పూర్తి చేయాలనుకుంటున్నారు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రాహకులుగా ఉన్న ఈ చిత్రానికి మైకీ మెక్లేరే సంగీతం అందిస్తున్నారు.