Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింగర్ సునీతను వాట్సాప్ నెంబర్ అడిగితే..?

Advertiesment
సింగర్ సునీతను వాట్సాప్ నెంబర్ అడిగితే..?
, సోమవారం, 10 మే 2021 (12:32 IST)
sunitha
ప్రముఖ సింగర్ సునీత అభిమానులతో చేసిన చాట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత కొన్ని రోజుల కిందట రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తర్వాత కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరం ఉండగా ఈ మధ్య మళ్ళీ అడుగు పెట్టింది. సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య బాగా యాక్టివ్‌గా ఉంటుంది.
 
ప్రస్తుతం బుల్లితెర లో జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ షో లో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటున్న సునీత.. ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రెండు రోజుల నుండి లైవ్ లోకి వస్తుంది. 
 
తన అభిమానులతో తెగ ముచ్చటిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ప్రజల్లో ఉన్న భయాలు, ఆందోళనలను తన పాటలతో దూరం చేస్తూ తన అభిమానులకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది.
 
ప్రస్తుతం కరోనా బాధితులకు బెడ్స్ కావాలి, ఆక్సిజన్ దొరకడం లేదు. ఇలా ఎంతోమంది బాధితులు సహాయాన్ని కోరుకుంటున్నారు. వీలైనంత వరకు సహాయం చేయాలి అంటూ అభిమానులతో పంచుకుంది. 
 
అంతే కాకుండా తన వంతు సహాయం కూడా వీలైనంతగా చేస్తున్నాను అంటూ.. తనకు తెలిసింది ఇదే అంటూ తెలిపింది. అందుకే ఇలా పాడుతూ మీ అందరిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాను అంటూ సునీత తెలిపింది.
 
ఇక ప్రతి రోజు ఎనిమిది గంటలకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా లైవ్ లోకి వస్తున్న సునీతతో అభిమానులు బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక నిన్న రాత్రి 8 గంటలకు కూడా లైవ్ లోకి వచ్చిన సునీతతో ఫాలోవర్స్. తన అభిమానులు అడిగిన పాటలను వినిపిస్తూ వాళ్ళని సంతోష పెట్టారు. 
 
ఇదిలా ఉంటే ఓ నెటిజన్ తన వాట్సాప్ నెంబర్ చెప్పమని అడిగాడు. దీంతో వెంటనే సునీత నవ్వుతూ తనదైన స్వీట్ వాయిస్ తో సో సారీ అండి అంటూ నొప్పించకుండా బదులిచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుస సినిమాలతో పవన్ కల్యాణ్ బిజీ బిజీ.. రవితేజ దర్శకుడితో..?