Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కులుమనాలిలో చిత్రీకరించిన నేను-కీర్తన చిత్రం

Chimata Ramesh Babu - sandhya

డీవీ

, గురువారం, 4 ఏప్రియల్ 2024 (15:07 IST)
Chimata Ramesh Babu - sandhya
టీజర్ చూస్తుంటే కొత్త దర్శకుడితో కొత్త నిర్మాణ సంస్థ తీసిన సినిమా అనిపించడం లేదని, హీరోగా చిమటా రమేష్ బాబు(సి.హెచ్.ఆర్)కి చాలా మంచి భవిష్యత్ ఉందని "నేను-కీర్తన" ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టి.ప్రసన్నకుమార్, వీరశంకర్ అన్నారు.
 
చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన "నేను-కీర్తన" చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ విడుదల వేడుక హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, అతిథులుగా హాజరయ్యారు.
 
webdunia
Nenu-Kirtana poster
చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) రూపంలో ఓ మల్టీ టాలెంటెడ్ హీరో తెలుగు తెరకు పరిచయమవుతుండడం సంతోషదాయకమని, ఫస్ట్ లుక్ లో, టీజర్ లో సక్సెస్ కళ ప్రస్పుటంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
"నేను-కీర్తన" చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తనే హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించానని, ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో మల్టీ జోనర్ చిత్రంగా మలచిన "నేను-కీర్తన" చిత్రం కచ్చితంగా చేరుతుందని, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు, ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
"నేను-కీర్తన" చిత్రంలో నటించడం చాలా సంతృప్తినిచ్చిందని సీనియర్ నటులు విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు పేర్కొన్నారు. ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్ రిషిత కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎల్.రాజా, రాజ్ కుమార్, ఎర్రచీర సుమన్ బాబు తదితరులు పాల్గొని "నేను - కీర్తన" ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్న కోన వెంకట్... ఎందుకో?