Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో జాతీయ అవార్డుల పంపిణీ వేడుక... బెస్ట్ చిత్రంగా "కార్తికేయ-2"

Advertiesment
mithun

ఠాగూర్

, మంగళవారం, 8 అక్టోబరు 2024 (16:13 IST)
ఢిల్లీ వేదికగా 70వ జాతీయ అవార్డు వేడుక మంగళవారం జరుగుతుంది. ఇది భారతీయ సినిమాకు ఇది ప్రత్యేకమైన రోజుగా సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన కళాకారులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో దాదా సాహెబ్ ఫాల్కే, రాష్ట్ర అవార్డులను నేడు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును అందజేస్తారు. ఈ యేడాది మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అందిస్తారు. చనున్నారు. 70వ జాతీయ సినిమా అవార్డులను ఆగస్టు 16న ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ అవార్డులను మంగళవారం ప్రదానం చేస్తున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. 
 
అయితే, బెస్ట్ కొరియాగ్రాఫర్ అవార్డును తెలుగు నృత్యదర్శకుడు జానీ మాస్టర్ జాతీయ అవార్డు అందుకోవాల్సి ఉన్నా, అతనిపై అత్యాచారం ఆరోపణలు రావటంతో కేసు నమోదైన కారణంగా జానీ మాస్టర్‌కు ఇవ్వాల్సిన జాతీయ అవార్డును ప్రభుత్వం రద్దు చేసింది. ఇక 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డులు వివరాలను పరిశీలిస్తే‌‌..
 
ఉత్తమ తెలుగు చిత్రం : కార్తికేయ-2 
ఉత్తమ కన్నడ చిత్రం : కేజీఎఫ్‌-2 
ఉత్తమ తమిళ చిత్రం : పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1  
ఉత్తమ మ్యూజికల్‌ డైరెక్టర్‌ : రెహ్మాన్‌ (పొన్నియన్‌ సెల్వన్‌-1) 
ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ : పొన్నియన్‌ సెల్వన్‌ 
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ : పొన్నియన్‌ సెల్వన్‌ 
ఉత్తమ సహాయనటి : నీనా గుప్తా  
ఉత్తమ సహాయనటుడు : పవన్‌ రాజ్‌ మల్హోత్రా
ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ : దీపక్‌ దువా (హిందీ) 
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : కుచ్ ఎక్స్ ప్రెస్.. గుజరాతీ, నిక్కిజోషి. 
బెస్ట్ మ్యూజిక్ : బ్రహ్మస్త్ర.. శివ (హిందీ) ప్రీతమ్ 
ఉత్తమ సంగీతం నేపథ్యం : పొన్నియన్ సెల్వన్ 1 (తమిళ్) 
మ్యూజిక్ డైరెక్టర్ : ఏఆర్ రెహ్మాన్ 
బెస్ట్ రైటర్ : గుల్ మోహర్ : అర్పితా ముఖర్జీ (రాహుల్ వి చిట్టెల)
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ : అన్బరివు (కేజీఎఫ్ 2)
బెస్ట్ కొరియోగ్రఫీ : సతీశష్ కృష్ణన్ తిరుచిత్రాంబళం 
బెస్ట్ లిరిక్స్ : ఫౌజా..(హరియాన్వీ)
రచయిత : నౌషద్ సదర్ ఖాన్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : ( ఆట్టం) ఆనంద్ ఏకార్షి 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుష్టశక్తిపై పోరాడే శక్తిగా మంచు లక్ష్మి ఆదిపర్వం చిత్రం