Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nani: నాని ప్రెజెంట్ కోర్టు - స్టేట్ vs ఎ నోబడీ గ్లింప్స్ రిలీజ్

Advertiesment
Court sean

దేవి

, శనివారం, 1 మార్చి 2025 (17:25 IST)
Court sean
నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ ఒక ఆసక్తికరమైన గ్లింప్స్ ద్వారా సినిమా ట్రైలర్ గురించి అనౌన్స్ చేశారు.
 
వీడియోలో హర్ష్ రోషన్ పాత్ర అతను ఫోన్‌లో మాత్రమే మాట్లాడిన తన గర్ల్ ఫ్రండ్ ని కలవమని ఉత్సాహంగా అడుగుతున్నట్లు చూపిస్తుంది. మరొక సన్నివేశంలో ఒక క్లయింట్ న్యాయవాదితో మీటింగ్ షెడ్యూల్ చేయడానికి ప్రయత్నిస్తాడు, అతని అసిస్టెంట్, ప్రియదర్శి శుక్రవారం ఏదో ముఖ్యమైన విషయం గురించి సూచిస్తాడు. సినిమా థియేటర్లలోకి రావడానికి వారం ముందు మార్చి 7న ట్రైలర్ విడుదల అవుతుందని రివిల్ చేస్తూ క్లిప్ ముగుస్తుంది.
 
ముందుగా రివిల్ చేసినట్లు సినిమా పోక్సో చట్టం నేపథ్యంలో వుంటుంది, ఇది క్లిష్టమైన, సోషల్ ఇష్యూని ప్రస్తావిస్తుంది.
 
శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమాని శ్రీనివాస్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి దినేష్ పురుషోత్తమన్ తన అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించగా, విఠల్ కోసనం ఆర్ట్ డైరెక్టర్‌, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. స్క్రీన్‌ప్లేను కార్తికేయ శ్రీనివాసులు, వంశీధర్ సిరిగిరి రాశారు.
 
తారాగణం: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషిక, వడ్లమాని శ్రీనివాస్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tarun Bhaskar : సంతాన ప్రాప్తిరస్తు నుంచి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్