Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Advertiesment
Yogi - balakrishna

దేవీ

, సోమవారం, 24 నవంబరు 2025 (08:17 IST)
నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డివోషనల్ యాక్షన్ విజువల్ వండర్ అఖండ 2 ది తాండవం పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధంగా ఉంది. ముంబైలో సింగిల్ విడుదల చేశారు. బెంగళూరులో అద్భుతమైన ట్రైలర్ లాంచింగ్ తర్వాత ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ సనాతన ధర్మాన్ని అద్భుతంగా చాటి చెప్పింది
.
బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నటి సంయుక్త, నిర్మాతలు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి  అఖండ టీంని కలవడానికి సమయం తీసుకున్నారు. సినిమాలో రష్‌లను వీక్షించారు. ఈ సినిమా భారీ కాన్వాస్, భక్తి కథనం, అద్భుతమైన విలువలని ప్రదర్శించే విధానం చూసి ముఖ్యమంత్రి ముగ్ధులయ్యారు.
 
చిత్ర యూనిట్ యోగి ఆదిత్యనాథ్‌కు సింబాలిక్ ట్రైడెంట్‌ను బహుకరించింది. అద్భుతమైన కంటెంట్ ప్రేక్షకులకు అందరిలో ప్రతిధ్వనించే  భక్తి చిత్రాన్ని అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి నిర్మాతలను ప్రశంసించారు.
 
ఈ హై-ప్రొఫైల్ సమావేశం సినిమా పాన్-ఇండియా ఎట్రాక్షన్ ని బలోపేతం చేయడమే కాకుండా ఉత్తర భారత మార్కెట్‌లో ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. విడుదల దగ్గర పడుతుండటంతో, అఖండ 2 బృందం ప్రమోషన్‌లను మరింత పెంచడానికి సన్నాహాలు చేస్తోంది,
 
స్టార్ పవర్, భక్తి ఇతివృత్తాలు, కీలకమైన సాంస్కృతిక వ్యక్తులకు చేరువ కావడం అఖండ 2 ను సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఈవెంట్‌ గా నిలిపింది.
 
M. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట,  గోపీచంద్ ఆచంట భారీ స్థాయిలో నిర్మించిన అఖండ 2ని దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉత్తర భారతం అంతటా భారీగా విడుదల చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి